హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారు, నోరు జారిన నిత్యామేనన్, సంచలన కామెంట్స్

Published : Jul 31, 2025, 10:30 AM IST

పెళ్లి విషయంలో నోరు జారి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు హీరోయిన్ నిత్యా మేనన్. 37 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసెత్తని స్టార్ హీరోయిన్, తాజాగా చేసిన కామెంట్స్ ఆడియన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

PREV
15

సహజ నటి నిత్యా మేనన్

హీరోయిన్ నిత్యా మేనన్ తన సహజమైన నటనతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నప్పటికీ, ఆమె ఇప్పటికీ వెండితెరపై యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. నిత్యా మేనన్ నటించిన తాజా చిత్రం ‘సార్ మేడమ్’ ప్రొమోషన్స్‌లో ఆమె చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

DID YOU KNOW ?
ఆరు భాషల్లో అనర్గళంగా
నిత్యా మేనన్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.
25

నోరు జారి కామెంట్ చేసిన స్టార్ హీరోయిన్

విజయ్ సేతుపతి హీరోగా, నిత్యా మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘సార్ మేడమ్’ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. సినిమా ప్రమోషన్స్ భాగంగా జరిగిన ఓ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు నిత్యా మేనన్‌ను పెళ్లిపై ప్రశ్నించారు. దీనిపై స్పందించడానికి ముందుగా నిత్యా మాట్లాడుతూ.. “ఈ సినిమా హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారు” అని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్య విన్న ఈవెంట్‌కు హాజరైన మీడియా టీమ్ తో పాటు ఆడియన్స్ కూడా ఒక్కసారిగా నవ్వేశారు.

35

తప్పు సరిచేసుకున్న నిత్యా మేనన్

ఆ వెంటనే హీరో విజయ్ సేతుపతి జోక్యం చేసుకుని “సరిగ్గా చెప్పండి” అంటూ సూచించగా, తనమాట తప్పు అని గ్రహించిన నిత్యా మేనన్ వెంటనే సరిచేసుకుంటూ “నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోవడం మంచిది అని నన్ను కన్‌విన్స్ చేయడానికి హీరో, డైరెక్టర్ చాలా ట్రై చేశారు.” కాని ఈ విషయంలో నేను కన్విన్స్ అయ్యేది లేదు అని క్లారిటీ ఇచ్చింది నిత్యా మేనన్. ఈ సందర్భం జరిగిన చర్చ పెద్ద ఎత్తున నవ్వులు పూయించింది. నిత్యా మేనన్ వ్యాఖ్యలకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

45

ఈ పెళ్లి గోల ఏంటీ అంటూ అసహనం

అంతే కాదు నిత్యా మేనన్ మాట్లాడుతూ.. ఎందుకండీ ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి అంటారు, ఈ పెళ్లి గోల ఏంటండి, ఎక్కడికి వెళ్లినా పెళ్లి పెళ్లి అని చంపేస్తున్నారు. అని ఒక రకంగా అసహనం వ్యక్తం చేశారు నిత్యా మేనన్. నిత్యా మేనన్ ఇప్పటి వరకు పెళ్లిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడకపోయిన ఆమె ఈసారి మాత్రం తన కామెంట్‌తో అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక ఈ వీడియోకు సంబంధించిన క్లిప్ ఇప్పటికే యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నిత్యా మేనన్ కామెంట్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

55

సార్ మేడమ్ సినిమా రిలీజ్

‘సార్ మేడమ్’ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో తలైవన్ తలైవి తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో సార్ మేడమ్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమాను తమిళ దర్శకుడు అరుణ్ ఆర్ డైరెక్షన్ లో తెరకెక్కించారు. ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగిన వేళ, నిత్యా మేనన్ చేసిన ఈ వ్యాఖ్య సినిమాకు మరింత పబ్లిసిటీ కల్పించిందనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories