తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పే వారిని తాను అస్సలు భరించలేనని స్పష్టం చేసింది. ఇటీవల తమన్నా విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.
తమన్నా సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో సైతం పాపులర్ అయిన నటి. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ అంటే దర్శక నిర్మాతలు తమన్నానే సంప్రదిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా తన గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మెప్పిస్తోంది. తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తన భాగస్వామి నుంచి ముఖ్యంగా ఆశించే అంశాలేంటో వివరించింది.
25
అబద్దాలు భరించలేను
తమన్నా భాటియా మాట్లాడుతూ, “నేను అబద్ధాలు అస్సలు భరించలేను. ఏదైనా తప్పు జరిగితే, దానిని నిజాయితీగా చెప్పడం నాకు ఇష్టం. సమస్య ఉంటే దానికి పరిష్కారం కనుగొనడంలో నేను ఎప్పుడూ ముందుంటాను. మీరు తప్పు చేసినా, దాన్ని సరిచేయడంలో సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. కానీ అబద్ధం చెప్పడం మాత్రం నాకు అస్సలు నచ్చదు,” అని తమన్నా స్పష్టం చేసింది.
35
అదే పెద్ద సమస్య అవుతుంది
“ఎవరైనా నా ముఖం మీదే అబద్ధం చెబుతుంటే, నన్ను మూర్ఖురాలిగా భావిస్తే అది నాకు మరింత కోపం తెప్పిస్తుంది. విషయం కేవలం అబద్ధం చెప్పడమే కాదు, ఆ వ్యక్తి నన్ను మోసం చేయాలి అని అనుకోవడం కూడా చాలా బాధిస్తుంది. ఆ భావనే పెద్ద సమస్య” అని తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో తమన్నా భవిష్యత్ జీవిత భాగస్వామి గురించి కూడా తన అభిప్రాయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను మంచి జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరికైనా నేను జీవిత భాగస్వామి అయినప్పుడు వారు గత జన్మలో చేసిన పుణ్యఫలం వల్లే తాను దొరికినట్లు భావించేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అదృష్టవంతుడు ఎవరో త్వరలో తెలుస్తుంది,” అని అన్నారు.
55
విజయ్ వర్మతో బ్రేకప్ కి కారణం
తమన్నా భాటియా గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నారు. 2023లో వీరిద్దరూ ఒక పార్టీకి కలిసి హాజరైనప్పుడు మొదటిసారి ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అదే సంవత్సరం Lust Stories 2 వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో తమన్నా, విజయ్ వర్మ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. రెండేళ్ల రిలేషన్ షిప్ తర్వాత తమన్నా విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకుంది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పకూడదు అని తమన్నా చేసిన వ్యాఖ్యలు విజయ్ వర్మ గురించేనా అనే చర్చ నెటిజన్ల మధ్య జరుగుతోంది. బహుశా వీరిద్దరి బ్రేకప్ కి అదే కారణం కావచ్చు అని భావిస్తున్నారు.