పవన్, ప్రభాస్ కాంబో మూవీ.? ఆ ఊహ ఎంత బాగుందో.. కలిస్తే బాక్సాఫీస్ షేకే

Pavithra D   | ANI
Published : Nov 01, 2025, 02:33 PM IST

Prabhas: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో చిత్రం ఆగిపోవడంతో, అదే కథతో తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేయబోతున్నారనే ప్రచారం తమిళ మీడియాలో మొదలైంది. ఇది కేవలం పుకారే 

PREV
15
ఆ కథతోనే ఈ హీరోలతో..?

దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇటీవల రజనీకాంత్ హీరోగా తీసిన కూలీ చిత్రంతో డీలా పడ్డాడు. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని లోకేష్ ప్రయత్నించగా, అది కార్యరూపం దాల్చలేదు.

25
ఖైదీ 2 ప్రీ-ప్రొడక్షన్

ప్రస్తుతం ఆయన ఖైదీ 2 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిణామాల మధ్య తమిళ మీడియా ఒక కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. రజనీకాంత్, కమల్ హాసన్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది కాబట్టి, ఆ కథతో తెలుగులో స్టార్ హీరోలు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

35
పుకారే అని కొట్టిపారేశారు..

ఈ వార్తతో తెలుగు అభిమానులు మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఇది నిజం కాదని కొట్టిపారేశారు. ఇదంతా కేవలం తమిళ మీడియా సృష్టించిన ప్రచారమే అని తేల్చేశారు. లోకేష్ కనకరాజ్‌కు ఈ ఆలోచన ఉందో.. లేదో.. కానీ ఈ ప్రచారం మాత్రం ఆసక్తికరంగా మారింది.

45
ప్రభాస్, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తే

నిజంగా ఒకవేళ ప్రభాస్, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తే, అది బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టగలదని ఊహించడం కష్టం కాదు. ఈ ప్రాజెక్ట్ కనుక నిజమైతే, తెలుగు సినిమా చరిత్రలో అది ఒక మైలురాయి అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

55
2030 వరకు ప్రభాస్ బిజీ..

ప్రభాస్ మాత్రం 2030 వరకు సినిమాలు లైన్ లో పెట్టేశాడు. అటు ప్రభాస్ 'రాజా సాబ్' మూవీపై ప్రస్తుతం అందరి దృష్టి పడింది. సంక్రాంతి కానుకగా ఇది రిలీజ్ కానుంది. అటు పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఓటీటీలో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంటోంది. 

Read more Photos on
click me!

Recommended Stories