సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన ఇల్లున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? కాస్ట్లీ ఇళ్లు కలిగి ఉన్న హీరోలలో తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారు. 150 కోట్ల విలువ చేసే ఇంట్లో ఉంటోన్న హీరో ఎవరు?
వందల, వేల కోట్ల ఆస్తులు ఉన్న హీరోలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ కాస్ట్లీ ఇల్లు కలిగిన వారు అందులో ఎవరున్నారో తెలుసా? ఆస్తులు తక్కువ ఉన్నా.. నివసించే ఇల్లు కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉన్న హీరోలలో ధనుష్ ముందున్నారు. ధనుష్ దాదాపు 150 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు. తన మామ రజినీకాంత్ నివసిస్తున్న పోయోస్ గార్డెన్ ఏరియాలోనే ధనుష్ కొత్త ఇల్లు కట్టుకున్నారు.
210
అల్లు అర్జున్
పుష్ప సినిమాతో పాన్-ఇండియా స్టార్‌గా మారాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అట్లీతో 800 కోట్ల భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ తన తండ్రితో కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉన్న అల్లు అర్జన్.. త్వరలో కొత్త ఇంటికి మారబోతున్నారట. హైదరాబాద్‌లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ఇంటిని ఆయన నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది.
310
దళపతి విజయ్
సినిమాలు వదిలి రాజకీయాల్లో అడుగు పెట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్. TVK పార్టీని స్థాపించి పాలిటిక్స్ లో యాక్టీవ్ అయ్యాడు. సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదించాడు విజయ్.. ఇక చెన్నైలో దళపతి విజయ్ నివసించే విలాసవంతమైన బంగ్లా విలువ దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్. బాహుబలి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. వరుసగా అరడజనుకు పైగా సినిమాలు లైన్ అప్ చేశాడు. ఇక ఆయనకు హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ 60 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాగా ప్రభాస్ ప్రస్తుతం 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి, అడ్వాన్స్ టెక్నాలజీతో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నట్టు సమాచారం.
510
అక్కినేని నాగార్జున
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఆస్తులు ఎక్కువగా ఉన్న హీరో నాగార్జున. ఆస్తుల విషయంలో సౌత్ లో నాగర్జున మొదటి స్థానంలో ఉన్నారు. హీరోగా, హోస్ట్ గా, స్టూడియో అధినేతగా, బిజినెస్ మెన్ గా కోట్లు సంపాధిస్తున్న నాగార్జున దాదాపు 50 కోట్ల విలువైన ఇంట్లో నివసిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కాస్ట్లీ ఏరియా అయిన జూబ్లీ హిల్స్ లో నాగ్ ఇల్లు ఉంది.
610
చిరంజీవి, రామ్ చరణ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు పాన్ ఇండియా హీరో రామ్ చరణ్.. ఇద్దరు వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. హైదరాబాద్ లోని అత్యంత కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఇంట్లో ఈ ఇద్దరు హీరోలు ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. వారు ఉంటున్న ఇంటి విలువ దాదాపు 40 కోట్ల పైనే ఉంటుందని అంచనా.
710
రజనీకాంత్
వందల కోట్ల ఆస్లులు ఉన్నా.. చాలా సింపుల్ గా కనిపించే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ హీరో.. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం పోయేస్ గార్డెన్ లో నివసిస్తుంటాడు. ఈ ఏరియాలో ఉన్న రజినీకాంత్ ఇంటి విలువ దాదాపు 40 కోట్ల వరకూ ఉంటుందని అంచన.
810
మహేష్ బాబు
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తోన్న ఈ హీరో.. హైదరాబాద్ లో నివసిస్తున్న ఇంటి విలువ దాదాపు 30 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
910
పృథ్వీరాజ్ సుకుమారన్
ఈ టాప్ 10 జాబితాలో మలయాళ చిత్ర పరిశ్రమ నుండి చోటు దక్కించుకున్న ఏకైక నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అతనికి కేరళతో పాటు ముంబైలో కూడా ఓ ఇల్లు ఉంది. ఆ బంగ్లా విలువ దాదాపు 30 కోట్లు ఉంటుందని అంచనా.
1010
కమల్ హాసన్
ఖరీదైన ఇళ్లను కలిగి ఉన్న టాప్ 10 స్టార్ల జాబితాలో కమల్ హాసన్ కూడా ఉన్నారు. హీరోగా , రాజ్యసభ సభుడిగా, రాజకీయ నాయకుడిగా రాణిస్తోన్న ఈ 70 ఏళ్ల స్టార్.. చెన్నైలో 20 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు.