సూర్య-జ్యోతిక ఎంత ధనవంతులో తెలుసా?.. సూర్య కంటే జ్యోతికకే ఎక్కువ ఆస్తులున్నాయా?

First Published | Nov 9, 2024, 10:30 AM IST

కోలీవుడ్‌లో సూర్య, జ్యోతిక ల జంట ఆదర్శ జంటగా ఉన్నారు. అయితే వీరి ఇద్దరి ఆస్తుల వివరాలు చూస్తే మాత్రం మతిపోతుంది. వందల కోట్లకు అధిపతులు కావడం విశేషం. 

తమిళ సినిమాలో ప్రేమ జంటలకు కొదవలేదు. సినిమాల్లో తమతో నటించిన నటీనటులనే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు చాలా మంది స్టార్స్  ఉన్నారు. అందులో సూర్య-జ్యోతిక, అజిత్-షాలిని, విఘ్నేష్ శివన్-నయనతార వంటి ప్రముఖులు పెళ్లయిన తర్వాత కూడా ప్రేమగా ఉన్నారు. ఈ ప్రేమ వారిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో, కోలీవుడ్‌లోని ధనవంతులైన జంట గురించి ఈ కథనంలో చూద్దాం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సూర్య, జ్యోతిక

తమిళ సినిమాలో అత్యధిక ఆస్తులను కలిగిన ధనవంతులైన జంట అంటే అది సూర్య-జ్యోతిక. వీరిద్దరూ మొదటిసారిగా 'పూవెల్లమ్‌ కెట్టుపార్‌ '(తెలుగులో `పోరాటం`) సినిమాలో జంటగా నటించారు. అప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న సూర్య-జ్యోతిక 'కాక్క కాక్క' సినిమాలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. ఆ సినిమా హిట్ అయినట్లే వారి ప్రేమ కూడా విజయవంతమైంది. కాకపోతే పేరెంట్స్ వీరి ప్రేమని ఓకే చెప్పడానికి కొంత కాలం వెయిట్‌ చేయాల్సి వచ్చింది.  


సూర్య, జ్యోతిక

చివరగా, సూర్య కుటుంబంలో జ్యోతికతో వివాహానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత, 2006లో నటి జ్యోతికను సూర్య వివాహం చేసుకున్నారు. కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు సూర్యను వివాహం చేసుకున్న జ్యోతిక, ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. పెళ్లయిన తర్వాత సూర్య-జ్యోతిక దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పెద్దయ్యాక జ్యోతిక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.

అప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో నటించిన జ్యోతిక, తన రెండో ఇన్నింగ్స్‌లో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు ప్రయారిటీ ఇచ్చారు. తన పాత్రకు ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేసుకుంటూ వస్తున్నారు.  అందుకే విజయ్‌తో నటించే రెండు అవకాశాలను తిరస్కరించారు. ఒకటి అట్లీ దర్శకత్వం వహించిన 'మెర్సల్' సినిమా, మరొకటి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'కోడ్' సినిమా. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ అయ్యాయి.

దానికి బదులుగా 'కాదల్ ది కోర్', 'పొన్మగల్ వాందల్‌' వంటి విభిన్నమైన కథాంశం ఉన్న సినిమాలను ఎంచుకుని నటించారు జ్యోతిక. ఈ సినిమాలకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. మరోవైపు, నటుడు సూర్య వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శివ అండ్‌ టీమ్‌ దర్శకత్వంలో `కంగువా` సినిమాలో నటించారు. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. 

సూర్య జ్యోతిక కలిపి నికర ఆస్తి

సినిమాల్లో నటించడమే కాకుండా, 2D ఎంటర్‌టైన్‌మెంట్స్  అనే నిర్మాణ సంస్థ ద్వారా తన భర్త సూర్యతో కలిసి కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తుంది జ్యోతిక.  ఇటీవల వీరి నిర్మాణంలో వచ్చిన 'మెయ్యలగన్' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 శాతం లాభాలను ఇచ్చిందని హీరో సూర్య చెప్పారు.

సూర్య జ్యోతిక కలిపి నికర ఆస్తి

సినిమా, వ్యాపార రెండింటిలోనూ రాణిస్తున్న సూర్య-జ్యోతిక కోలీవుడ్‌లోని ధనవంతులైన జంటగా ఉన్నారు. వారిద్దరి మొత్తం ఆస్తుల విలువ ₹537 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో నటుడు సూర్య ఆస్తుల విలువ ₹206 కోట్లు మాత్రమే, కానీ జ్యోతిక పేరుతో మాత్రం ₹331  కోట్ల ఆస్తులుండటం విశేషం. ఈ లెక్కన సూర్య కంటే జ్యోతికనే రిచ్‌ అని చెప్పొచ్చు. అయితే తన భార్య పేరుమీదే సూర్య ఎక్కువగా ఆస్తులు రిజిస్టర్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

Read more: 40ఏళ్లు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉన్న టాప్‌ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Also read: సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఉదయ్‌ కిరణ్‌ ఎవరిని ప్రేమించాడో తెలుసా? చిరంజీవి చేరదీయడం వెనుక ఇంత కథ ఉందా?

Latest Videos

click me!