హీరోయిన్ కోసం వుమెన్స్ కాలేజీలకు వెళ్లిన పూరి జగన్నాధ్ కి అవమానం.. ఇలియానా, హన్సిక లాంటి వాళ్ళు అందుకే

First Published | Nov 9, 2024, 10:17 AM IST

నటి మాధవీలత టాలీవుడ్ లో హీరోయిన్లకు, నటీమణులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. కాస్టింగ్ కౌచ్ పై మాధవీలత చాలా సందర్భాల్లో తన గళం వినిపించారు. తెలుగు హీరోయిన్లకు ఎందుకు అవకాశాలు ఇవ్వరు అని మాధవీలత చాలా సార్లు ప్రశ్నించారు.

నటి మాధవీలత టాలీవుడ్ లో హీరోయిన్లకు, నటీమణులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. కాస్టింగ్ కౌచ్ పై మాధవీలత చాలా సందర్భాల్లో తన గళం వినిపించారు. తెలుగు హీరోయిన్లకు ఎందుకు అవకాశాలు ఇవ్వరు అని మాధవీలత చాలా సార్లు ప్రశ్నించారు. పొరిగింటి పుల్లకూర రుచి కాబట్టి మన తెలుగు హీరోయిన్లు డైరెక్టర్స్, నిర్మాతలకు నచ్చరు. 

అందుకే భాష సరిగ్గా రాణి నార్త్ వాళ్ళని, తమిళ, మలయాళ హీరోయిన్లని తెచ్చుకుంటారు అంటూ మాధవీలత కామెంట్స్ చేసింది. హీరోయిన్లని పక్కన పెడితే కనీసం కీలక పాత్రల్లో నటించే నటీమణులు కూడా తెలుగు వాళ్ళు ఉండడం లేదు అంటూ మాధవీలత ప్రశ్నించింది. అయితే తెలుగు హీరోయిన్లని తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది గురించి పూరి జగన్నాధ్ ఒకసారి తనకు చెప్పినట్లు మాధవీలత రివీల్ చేసింది. 


పూరి జగన్నాధ్ గారిని రెండు మూడుసార్లు కలిశాను. మీ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగాను. సూటబుల్ క్యారెక్టర్ ఉంటే తప్పకుండా చెబుతాను అని అన్నారు. ఆ టైంలో పూరి గారిని నేరుగా అడిగేశా.. తెలుగు అమ్మాయిలు ఇంత అందంగా ఉంటే ఎందుకు సార్ నార్త్ హీరోయిన్లని, పక్క రాష్ట్ర నటీమణులని తీసుకుంటున్నారు అని ప్రశ్నించా. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. 

మాధవి నేను ఒక విషయం చెప్పనా.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం ఎలాగైనా తెలుగు హీరోయిన్ నే తీసుకోవాలని లెక్కలేనన్ని వుమెన్స్ కాలేజీల చుట్టూ తిరిగా. కష్టపడి అందమైన అమ్మాయిలని సెలెక్ట్ చేశాం. వారిలో కొంతమంది మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు.. కొంతమంది అమ్మో మాకు భయం అన్నారు.. మరి కొంతమంది మా తల్లి దండ్రులని ఒప్పించాలి అని అన్నారు. అప్పటికీ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులని కలిశాం. 

వాళ్ళు ఎంత దారుణంగా అవమానించారో తెలుసా.. మా అమ్మాయి హీరోయిన్ కావడానికి అసలు ఒప్పుకోము. సినిమా ఇండస్ట్రీ నీచమైనది అంటూ అవమానించారు. ఇన్ని కండిషన్స్, అవమానాలు ఎదురైతే కనీసం దర్శకత్వం చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఈ గోల అంతా ఎందుకు అని నార్త్ హీరోయిన్లని తీసుకోవాల్సి వస్తోంది అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన మాటల్లో కూడా న్యాయం ఉంది అని మాధవీలత పేర్కొంది. తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీపై ఇలాంటి అభిప్రాయం ఉంది కాబట్టే ఇలియానా, హన్సిక లాంటి వాళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటున్నారు. 

Latest Videos

click me!