పుష్ప 2 : ఆ మీటింగ్ లో ఉన్నా,కానీ నాకు సంభందం లేదు, అల్లు అరవింద్ క్లారిటీ

First Published | Nov 9, 2024, 8:57 AM IST

పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. అల్లు అరవింద్ నెల మొదటి వారంలో సినిమా విడుదల చేస్తే మంచిదని చెప్పినప్పటికీ, పుష్ప 2 విడుదల తేదీని ఆయనే నిర్ణయించలేదని తెలిసింది. అయితే, పుష్ప 2 లాంటి సినిమాలకు రిలీజ్ డేట్ పెద్దగా ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు.

allu aravind, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అరవింద్ బ్యానర్ లో సినిమా చేయాలని అందరి దర్శకులుకి కోరిక.   తమ కాంపౌండ్ హీరోలతో పాటు ఎందరో  హీరోలతో అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ సాగుతున్నారు అరవింద్. ‘గీతా ఆర్ట్స్ ‘ పతాకంపై అనేక చిత్రాలను నిర్మించి విజయపథంలో సాగిన అల్లు అరవింద్ ప్లానింగ్ మెయిన్ అంటారు.

గత కొంతకాలంగా ‘గీతా ఆర్ట్స్ -2’ పేరుతో మరికొందరు వర్ధమాన నిర్మాతలతో కలసి చిత్రాలను నిర్మిస్తున్నారు.  కాలానుగుణంగా ప్లాన్స్ వేస్తూ సక్సెస్ ను సాధిస్తూంటారు ఆయన.  నిర్మాతలకు అల్లు అరవింద్ ఓ రోల్ మోడల్.  అలాంటి అల్లు అరవింద్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు ప్లాన్ చేస్తే బెస్ట్ అనే విషయం బాగా తెలుసు. అలాంటిది పుష్ప2 రిలీజ్ విషయంలో ఆయన కలగ చేసుకున్నారా.అందుకు ఆయన ఏమన్నారో చూద్దాం. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అరవింద్ రీసెంట్ గా ఓ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ ఏ సినిమాకు అయినాన నెల మొదటి వారంలో  రిలీజ్ చేస్తే కలెక్షన్స్ బాగుంటాయని, జనాలు దగ్గర డబ్బులు ఉంటాయనే విషయం చెప్పుకొచ్చారు.

దాంతో పుష్ప 2 చిత్రం వచ్చే నెల 5  వ తేదీన థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అంటే కావాలనే ఫస్ట్ వీక్ లో పుష్ప 2 ని తీసుకొస్తున్నారా, మీరే సలహా చెప్పారా అని ఆయన్ని అడిగారు. దానికి అల్లు అరవింద్ పాజిటివ్ గా స్పందించారు.


actor allu arjun movie pushpa 2


అల్లు అరవింద్ మాట్లాడుతూ తాను పుష్ప 2 చిత్రానికి డేట్ ఫిక్స్ చేసే మీటింగ్ లో ఉన్నాను కానీ,తనేమీ అలాంటి సలహా ఇవ్వలేదన్నారు. అయినా కొన్ని సినిమాలకు అలాంటి అవసరం లేదు అన్నారు. అవి ఎప్పుడు రిలీజ్ అయినా చూస్తారని చెప్పారు. అంటే పుష్ప 2 చిత్రం పనిగట్టుకుని ఫలానా డేట్ నే రిలీజ్ చేయనక్కర్లేదనేదే ఆయన అభిప్రాయం అదే ఆయన చెప్పుకొచ్చారు. 
 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


డిసెంబరు 5న 'పుష్ప-2' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇంకా నెలరోజులు లోపే  ఉంది. ప్రస్తుతం  షూటింగ్ దశలో వున్న ఈ చిత్రం మరో వైపు శరవేగంగా నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.   త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  అలాగే పుష్ప 2 చిత్రం మొత్తం 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

పుష్ప2 సినిమా భారతదేశంలో 6000 స్క్రీన్లలో విడుదల కానుంది. అంతే కాకుండా విదేశాల్లో కూడా 5500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ సైతం భారీగా ప్లాన్ చేసారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప 2 సినిమా క్రేజ్ పెరిగిపోవటమే అందుకు కారణం. ఇక ఈ చిత్రం  ప్రమోషన్స్ ని బీహార్ నుంచి మొదలుపెట్టటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. 

 గంధపు చెక్కల స్మగ్లింగ్, అమ్మ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  అలాగే రూ.370 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.   అయితే పుష్ప మొదటి భాగంలో  స్టార్  హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ సాంగ్ సినిమా కలెక్షన్స్ పై  ప్రభావం చూపిందని చెప్పవచ్చు. దీంతో పుష్ప సెకెండ్ పార్ట్ లోని స్పెషల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ  సాంగ్ లో ఎవరు చేయబోతన్నారనే వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఓ వార్త బయిటకు వచ్చింది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్‌' సంచలన విజయం సాధించడంతో  ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు.

దాంతో చిత్రం టీమ్ సైతం సినిమా అవుట్ ఫుట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ  చిత్రంలోని అల్లు అర్జున్‌ మేనరిజం, స్టయిల్‌, సినిమా మేకింగ్‌, సుకుమార్‌ బ్రిలియంట్‌ స్క్రీన్‌ప్లే అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసిన సుకుమార్ ఇప్పుడు ప్రమోషన్, రిలీజ్  పై దృష్టి పెట్టారు. 
 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 ఏదైమైనా పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. బిజినెస్ అలాగే జరిగింది. ఈ క్రమంలో   ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకునే చేస్తారు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. ఎక్కడిక్కడ ఫిక్స్ కాకుండా నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఆఖరి క్షణం వరకూ  సీన్, డైలాగులు మారుస్తాడని  చెప్తారు.   అయితేనేం అవుట్ ఫుట్ అదిరిపోతుంది. అదే కదా ప్రేక్షకులకు కావాల్సింది. 

Latest Videos

click me!