అందాలతార, అతిలోక సుందరి శ్రీదేవి. 54 ఏళ్ళ వయస్సులో అనుకోని అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది. తెలుగు,తమిళ,హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రీదేవి. ఆమె ఆమెను అభిమానించేవారు కోట్లలో ఉన్నారు. సెలబ్రిటీ హీరోలు కూడా శ్రీదేవి అంటే ఎంతో ఇష్టపడేవారు. కొంత మంది హీరోలు ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నాలు కూడా చేశారట.
బాలీవుడ్ కు రాకముందు శ్రీదేవి జితేంద్రకు అభిమాని. కానీ, శ్రీదేవి బాలీవుడ్‌కు వచ్చి సూపర్‌స్టార్‌గా మారగానే జితేంద్ర నటి శ్రీదేవికి అభిమాని అయ్యాడు. ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కాని ఈ విషయం జితేంద్ర ఇంట్లో తెలియడంతో ఆ బంధానికి బ్రేక్ పడిందట.
Also Read: 8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఇక శ్రీదేవిని ప్రేమించిన హీరోల లిస్ట్ లో మిథున్ చక్రవర్తి కూడా ఉన్నారు. ఆ కాలంలో బాలీవుడ్‌లో బాగా వెలిగిపోతున్న నటుడు. డ్యాన్స్, నటన రెండింటిలోనూ సూపర్ అనిపించుకున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. ఇక శ్రీదేవి అందానికి మనసు పారేసుకున్నాడు ఈ స్టార్ హీరో. నటి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి నటుడు మిథున్ చక్రవర్తి చాలా ప్రయత్నించాడు.
నటి శ్రీదేవికి కూడా మిథున్ చక్రవర్తి అంటే ఇష్టమే అని అప్పట్లో టాక్ గట్టిగా వినిపించింది. మరో వాదన ఏంటంటే.. శ్రీదేవి, నటుడు మిథున్ చక్రవర్తి ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని టాక్. కొన్నాళ్ళకు వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, తరువాత సీక్రేట్ గానే వీరు విడిపోయారని అంటుంటారు.
Also Read: 5000 పాటల షూటింగ్ జరిగిన గ్రామం, రామోజీ ఫిల్మ్ సిటీని మించిన లొకేషన్, ఎక్కడుందో తెలుసా?
ఇక శ్రీదేవిని ప్రేమించాడన్న రూమర్లు వచ్చిన మరో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని గతంలో పుకార్లు వచ్చాయి. వరుసగా వీరు సినిమాలు చేయడం వల్ల ఇలా పుకార్లు వచ్చి ఉంటాయని సమాచరం. అంతే కాదు శ్రీదేవి తల్లి రజినీకాంత్ కు ఇచ్చి శ్రీదేవిని పెళ్ళి చేయాలని చూసిందట. కాని అప్పటికే ఆయనకు పెళ్ళి జరిగిపోయిందని అంటుంటారు.
Also Read: చిరంజీవి బెడ్ రూమ్ లో హీరోయిన్ ఫోటో, ఉదయం లేవగానే మెగాస్టార్ చూసే ముఖం ఎవరిదో తెలుసా?
Sridevi
ఇక చివరిగా శ్రీదేవిని ఎంతో ప్రేమించి పెళ్లాడే అవకాశం దక్కించుకున్నాడు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. అతను శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే మిస్టర్ ఇండియా సినిమాకు శ్రీదేవిని ఎంపిక చేసి సినిమా నిర్మించాడు. చివరికి నటి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడంలో బోనీ కపూర్ విజయం సాధించాడు.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మరీ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు బోనీ కపూర్. ఈ జంటకు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.మొత్తానికి నటి శ్రీదేవిని తన జీవిత భాగస్వామిగా పొందాలని ఆరాటపడిన వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు.
Also Read: 1500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాల్లో సమంత. పాన్ ఇండియా హీరోల జంటగా స్టార్ హీరోయిన్