Pa Ranjith Will Direct First Dalit Cricketer Biopic : స్టార్ డైరెక్టర్వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి పా.రంజిత్. ఆయన 2012లో అట్టకత్తి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన రంజిత్, ఆ తర్వాత కార్తీతో మద్రాస్ అనే బ్లాక్‌బస్టర్ సినిమా తీశాడు. గోడ చుట్టూ జరిగే రాజకీయాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తన కెరీర్‌కు ఒక పెద్ద మలుపు.
మద్రాస్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఆయనతో తీసిన మొదటి సినిమా కబాలికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రంజిత్ పనితనానికి ఇంప్రెస్ అయిన రజినీ తన తర్వాతి సినిమాను కూడా ఆయన్నే డైరెక్ట్ చేయమని చెప్పారు. రంజిత్ దర్శకత్వం వహించిన కాలా సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
రజినీతో రెండు భారీ సినిమాలు తీసిన పా.రంజిత్, ఆ తర్వాత సార్పట్ట పరంపర అనే బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమా తీశాడు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత నక్షత్రం నగర్గిరదు, తంగలన్ వంటి సినిమాలు తీశాడు పా.రంజిత్. ఈ రెండు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.
దీంతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న పా రంజిత్ ప్రస్తుతం బయోపిక్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. సంచలనాల డైరెక్టర్ గా పేరున్న పా రంజిత్ భారతదేశపు తొలి దళిత క్రికెటర్‌గా పేరుగాంచిన పల్వంకర్ బాలు జీవితాన్ని సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలు జీవితం ఆధారంగా రామచంద్ర గుహ రాసిన ‘A Corner Of A Foreign Field' అనే పుస్తకం ఆధారంగా సినిమా తీయడానికి తనకు ఆహ్వానం వచ్చిందని పా.రంజితే ఒక కార్యక్రమంలో చెప్పారు.