Published : Apr 14, 2025, 11:41 AM ISTUpdated : Apr 14, 2025, 11:44 AM IST
సినిమా షూటింగ్ అంటే అందరికి హైదరాబాద్.. రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకు వస్తుంది. కాని ఎక్కువగా షూటింగ్స్ జరిగే ఊరు మరోకటి ఉందని మీకు తెలుసా? అక్కడ ఇప్పటి కే వేల కొద్ది పాటలు, వందల కొద్ది సినిమాల షూటింగ్స్ జరిగాయిన అని మీకుతెలుసా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది.? అక్కడ ఏ సినిమాల షూటింగ్స్ జరిగాయి. ?
Favourite Shooting Spot in సౌత్ : సినిమా షూటింగ్ అంటే ఎక్కువగా హైదరాబాద్, చెన్నైలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. అక్కడ చాలా స్టూడియోలు ఉండటం వల్ల అక్కడ గ్రాండ్ సెట్స్ వేసి షూటింగ్ చేస్తారు. ఏదైనా పల్లెటూరి కథ ఉంటే దర్శకులందరి మనసులో మెదిలే పేరు ఒకటుంటుంది. ఆ ఊరు రామోజీ ఫిల్మ్ సిటీనే మించిపోయింది. వందల, వేల షూటింగ్స్ జరిగిన ఆ గ్రామం పేరేంటి? ఎక్కడుంది.
ఆ ఊరు తమిళనాడులో ఉంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ కు అది ఫేవరెట్ షూటింగ్ స్పాట్. ఇంతకీ ఊరు మరేదో కాదు... పొల్లాచ్చి. అక్కడ దాదాపు 1500కు పైగా సినిమాల షూటింగ్స్ జరిగాయి. అంతే కాదు 5 000 కు పైగా పాటల షూటింగ్స్ కూడా ఆ గ్రామంలో జరిగాయి. అంత అందంగా ఉంటుంది పొల్లాచి.
భారతదేశంలో పొల్లాచ్చి కొబ్బరికి రాజధాని. ఇక్కడ పండే కొబ్బరి బొండాలకు దేశమంతా డిమాండ్ ఉంది. దీనివల్ల తమిళనాడులో పొల్లాచ్చి ఫేవరెట్ షూటింగ్ స్పాట్‌గా నిలిచింది.