Atlee Kumar
రజనీతో పాన్ ఇండియా సినిమా తీసే పనులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తారని సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. అట్లీ గత చిత్రం జవాన్‌లానే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ రజనీ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే అట్లీ దర్శకత్వంలో అతనికి ఇదే మొదటి సినిమా అవుతుంది.
త్రిష వల్ల విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు....? దళపతికి కష్టాలు తప్పవా..?
ప్రస్తుతం వేదతియాన్ సినిమా చేస్తున్నారు రజినీకాంత్. ఈ చిత్రానికి టి.ఎస్.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు రానా దగ్గుబాటి, భగత్ బాసిల్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వచ్చే అక్టోబర్‌లో దసరా సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది.
ముస్లిం హీరోల ను పెళ్లాడిన హిందూ హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Lokesh Kanagarajs Rajinikanth Coolie film update out
దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాలో రజనీకాంత్ నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జులై 1 నుంచి రెగ్యూలర్ షూటింగ్ కు రెడీఅవుతోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్, సత్యరాజ్, శ్రుతిహాసన్, నాగార్జున కూడా నటించనున్నారని సమాచారం.
30 కోట్ల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ కు పడిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఇది కాకుండా రజనీ చేతిలో మరో సినిమా ఉంది. అదే జైలర్ 2. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఆయన వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు సిద్దం అవుతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా విషయంలో అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.