ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి నేతృత్వంలోని అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ దాదాపు 77,000 కోట్లు. అంతే కాదు భారతదేశంలోని 100 మంది బిలియనీర్లలో ప్రతాప్ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఆస్తి విలువ రూ.22,000 కోట్లుగా చెబుతున్నారు. ఉపాసన తండ్రి అనిల్ కామినేని కేఈఐ అనే కంపెనీని నడుపుతున్నారు. అలాగే ఉపాసన తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇలా ప్యామిలీ అంతా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు.