రీ రిలీజ్ ట్రెండ్
ఈమధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలకు సబంధించి ఏదైనా సందర్భం ఉందంటే చాలు, వారికి సబంధించిన హిట్ సినిమాలు, ఎవర్ గ్రీన్ మూవీస్ ను రీరిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అంతే కాదు, ఆ సినిమాలు థియేటర్ లో చూడటం మిస్ అయిన వారికి ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నారు. ఈ ట్రెండ్ బాగా పెరిగిపోవడంతో, రీరిలీజ్ సినిమాల మధ్య కూడా కలెక్షన్ వార్ స్టార్ట్ అయ్యింది. సినిమాను బట్టి, స్టార్ హీరో అయితే కలెక్షన్లు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అందుకే రిలీజ్ కు ముందు ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలకు సబంధించిన రీరిలీజ్ లకు ప్రత్యేకంగా ట్రైలర్లు రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాదు సినిమాలకు ఇంకాస్త టెక్నాలజీని ఆడ్ చేసి, క్వాలిటీని కూడా పెంచుతున్నారు.