ప్రభాస్ సినిమా నుంచి ఫోటో లీక్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మైత్రీ మేకర్స్

Published : Aug 20, 2025, 01:19 PM ISTUpdated : Aug 20, 2025, 01:57 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సెట్స్ నుండి ఓ ఫోటో లీక్ కావడంతో టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 

PREV
15

ప్రభాస్ సినిమా నుంచి ఫోటో లీక్

ఈమధ్య సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే ఏదో ఒక లీక్ జరిగి ఫోటోలు, విడియోలు బయటు రావడం కామన్ అయిపోయింది. ఆమధ్య మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి కూడా ఓ చిన్న వీడియో లీక్ అయ్యి కలకలం రేపింది. కాగా తాజాగా ప్రభాస్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలోంచి రీసెంట్ గా ఓ ఫోటో లీక్ అయ్యింది. దాంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది.

DID YOU KNOW ?
ప్రభాస్ సినిమా రిలీజ్
ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీ అవుతోంది.
25

వార్నింగ్ ఇచ్చిన మైత్రీ మేకర్స్

ప్రభాస్ సినిమా నుంచి ఫోటో లీక్ అవ్వడంతో ఈవిషయాన్ని నిర్మాతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. లీక్ అయిన ఫోటోపై మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో ఘాటుగా స్పందించారు. "#PrabhasHanu సెట్స్‌ నుండి తీసిన ఓ ఫోటోను చాలా మంది షేర్ చేస్తున్నారు. మా టీమ్ ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు శ్రమిస్తోంది. ఇలాంటి లీకులు మా టీమ్‌ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇకపై ఎవరైనా ఈ ఫోటోను షేర్ చేస్తే, వారి ఖాతాలను రిపోర్ట్ చేయడమే కాకుండా, ఈ చర్యను సైబర్ నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని వారు ప్రకటించారు.

35

1940ల కాలం నాటి కథ

ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ‘ప్రభాస్‌హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈసినిమాకు ఫౌజీ టైటిల్ ప్రాచారంలో ఉంది. 1940ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడీగా నటి ఇమాన్వి నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు మిథున్ చక్రవర్తి , జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈమూవీ తెరకెక్కుతున్నట్టు సమాచారం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను ఇందులో చూపించబోతున్నట్టు కూడా ఓ రూమర్ ప్రచారం లో ఉంది.

45

హనురాఘవపూడి మార్క్ సినిమా

గతంలో అద్భుమైన సినిమాలు అందించారు దర్శకుడు హను రాఘవపూడి. "సీతారామం" వంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని అందిన ఈడైరెక్టర్ ఫస్ట్ టైమ్ ఇలా భారీ బడ్జెట్ సినిమా ద్వారా పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని వస్తున్నాడు. ఇక హను సినిమాలంటే మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తన ప్రతీ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తూవస్తున్నారు. ఈసారి కూడా ప్రభాస్ సినిమాకు ఆయనే స్వరాలు సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు సుదీప్ ఛటర్జీ నిర్వహిస్తుండగా, సాహిత్యం కృష్ణకాంత్ అందిస్తున్నారు.

55

ప్రభాస్ సినిమాలు

ఈ భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా సాగుతోంది. కానీ సెట్స్ నుంచి ఫోటో లీక్ కావడంతో చిత్రబృందం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. మేకర్స్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై చర్యలు ప్రారంభించగా, లీక్ ఫోటోను షేర్ చేసిన ఖాతాలపై రిపోర్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఈ ఘటన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కొంత మంది వాదన ఏంటంటే.. ప్రమోషన్ కోసంమే ఇలా లీకులు జరుగుతున్నాయని. దీని వల్ల సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇక ఈసినిమాతో పాటు ప్రభాస్ మారుతీతో రాజాసావ్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సలార్ 2, కల్కీ2 సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories