బాహుబలి సినిమాలో అనుష్క పాత్ర ప్రత్యేకం
ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించగా, అనుష్క శెట్టి, తమన్నా, హీరోయిన్స్‌గా కనిపించారు. అనుష్క పాత్రకు ఈ సినిమాలో విపరీతమైన ప్రాధాన్యం ఉంది. మొదటి పార్టులో దేవసేనగా బానిస పాత్రలో కనిపించి, రెండో భాగంలో యువరాణిగా తన నటనతో అందరిని మెప్పించింది అనుష్క. రెండు రకాల పాత్రలను ఆమె అంద్భుతంగా ప్లే చేసింది. వీరపత్నిగా, వీరమాతగా అనుష్క పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాలో అనుష్కుకు కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ప్రభాస్ తో కలిసి ఆమె విలన్స్ తో ఫైటింగ్ చేసిన సీన్స్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సెలబ్రిటీస్ సీన్స్ కు సంబంధించి కొన్ని సన్నివేశాలు డూప్ లతో చిత్రీకరించడం అందరికి తెలిసిన విషయమే. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్, రాణాలతో పాటు అనుష్క కోసం కూడా డూప్ యాక్ట్రస్ పనిచేశారట. అయితే విచిత్రం ఏంటంటే ఈసినిమాలో స్వీటి పాత్రకు డూప్ గా చేసింది కూడా ఓ హీరోయిన్నే.