చనిపోయే ముందు ముగ్గురు స్టార్ హీరోలను లంచ్ కి పిలిచి, దగ్గరుండి వడ్డించిన ఎన్టీఆర్, ఆ హీరోలు ఎవరు?

Published : Jul 27, 2025, 09:06 AM IST

సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే కొద్దిరోజుల ముందు ముగ్గురు స్టార్ హీరోలను తన ఇంటికి భోజనానికి పలిచారు. దగ్గరుండి మరీ వడ్డించారు, వారితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ లంచ్ కు పిలిచిన ముగ్గురు హీరోలు ఎవరు?

PREV
15

తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్

నందమూరి నటసార్వభౌముడు ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు ప్రజలందరికి ఆరాధ్యుడిగా వెలుగొందారు. నటుడిగా ఆయన చేసిన పాత్రలు, ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలతో తెలుగువారి మనసుల్లో దేవుడిలా నిలిచిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్ హీరోగా ఆయన చేసిన మైథలాజికల్ పాత్రలు చూసి, దేవుడంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడు అని ఫిక్స్ అయ్యారు అప్పటి ఆడియన్స్. తెలుగువారిపై ఎన్టీఆర్ పాత్రల ప్రభావం ఎలా ఉండేదంటే, తీర్థ యాత్రలు చేసేవారు కూడా చివరిగా మద్రాస్ వచ్చి ఎన్టీఆర్ ను చూస్తే వారి యాత్ర కంప్లీట్ అయినట్టుగా భావించేవారు.

DID YOU KNOW ?
ఎన్టీఆర్ అరుదైన రికార్డు
సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగు వెలిగిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.
25

రాముడిగా, కృష్టుడిగా, శివుడిగా, అర్జునుడు, కర్ణుడు, ఆకరికి దుర్యోధనుడు, రావణుడిగా కూడా నటించి మెప్పించారు సీనియర్ ఎన్టీఆర్. ఇక రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా కూడా ఆయన రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేనిది. అంతే కాదు ఆడవారికి ఆస్తిహక్కుతో పాటు ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ కు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, వారి గుండెల్లో గుడికట్టుకున్నారు. ఇక ముఖ్యమంత్రిగా దిగిపోయిన తరువాత కొంత కాలానికి ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు.

35

చనిపోయే ముందు ముగ్గురు హీరోలకు ఎన్టీఆర్ విందు

ఎన్టీఆర్ కొద్ది రోజుల్లో చనిపోతారు అనగా.. ఆయన ముగ్గురు స్టార్ హీరోలను ఇంటికి భోజనానికి పిలిచారు. వారికి దగ్గరుండి మరీ ఆయన వడ్డించారు. ఆ హీరోలకు ఇష్టమైన వంటకాలు చేయించారు. గడ్డపెరుగుతో సహా అన్నీ ఆయనే దగ్గరుండి వారికి వడ్డించారు. ఆ హీరోలతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ లంచ్ కు పిలిచిన ఆ ముగ్గరు హీరోలు ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరావు, సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల దంపతులు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఈ ముగ్గరు హీరోలను ఆయను ఇంటికి పిలిచారట. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల వెల్లడించారు.

45

అందరికంటే ముందు హైదరాబాద్ వచ్చిన ఏఎన్నార్

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఈ ముగ్గురు స్టార్ హీరోలుగా టాలీవుడ్ ను ఏలినవారే. మరీ ముఖ్యంగా కృష్ణ ఇండస్ట్రీకి రాకముందు ఎన్టీఆర్ ఏఎన్నార్ లు మాత్రమే టాలీవుడ్ కు మకుటం లేని మహారాజుల్లా ఉండేవారు. ఇక ఎన్టీఆర్ తో ఈ ఇద్దరు హీరోలకు ఓ దశలో విభేదాలు వచ్చాయి. ఎన్టీఆర్ కు అక్కినేనికి చాలా విషయాల్లో అభిప్రాయ బేదాలు వచ్చాయి. ఆతరువాత కాలంలో అవి సమసిపోయాయి. అక్కినేని నాగేశ్వరావు 1962 లోనే మద్రాస్ ను వదిలి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇక్కడ 76 లో అన్నపూర్ణ స్టూడియో పెట్టి, తన సినిమాలను తాను ఇక్కడి నుంచే చేసుకునేవారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అక్కినేనితో విభేదాలు కొనసాగాయి అనేది ఇండస్ట్రీ టాక్. ఆతరువాత రోజుల్లో ఈ ఇద్దరు స్టార్లు కలిసిపోయారు. ఏఎన్నార్ కూడా పలు సభల్లో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమకు తాను తన బ్రదర్ రామారావు క్రమశిక్షణ నేర్పించామని చెప్పుకొచ్చారు.

55

ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు చేసిన కృష్ణ

ఇక సూపర్ స్టార్ కృష్ణతో కూడా ఎన్టీఆర్ కు కొన్ని విషయాలలో విభేదాలు కలిగాయి. అవి ఒక సందర్భంలో తారా స్థాయికి వెళ్లాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కృష్ణ, విజయనిర్మల ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మూడు సినిమాలు చేశారు. ఆయన్ను పోలిన పాత్రలను క్రియేట్ చేసి, ఎన్టీఆర్ కు వారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వారిమధ్య విభేదాలు కారణం ఏంటీ అనేది గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూలలో కృష్ణ, విజయ నిర్మల స్వయంగా వెల్లడించారు. ఆతరువాత అవన్నీ మర్చిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారమని కూడా కృష్ణ అన్నారు. ఇలా గతంలో ఎన్ని విభేదాలు తలెత్తినా కూడా, చివరి రోజుల్లో ఎన్టీఆర్ తన సహచరులను ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చి వారితో సమయాన్ని గడిపారు.

Read more Photos on
click me!

Recommended Stories