ఈ ఒక్కతూరి ఏడుకొండల సామి నా పక్కన ఉంటే చానా పెద్దోడినై పూడుస్తా, పుష్ప డైలాగ్ తో విజయ్ దేవరకొండ కామెంట్స్

Published : Jul 26, 2025, 10:36 PM IST

కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ వెంకన్న సామి కరుణిస్తే తాను టాప్ పొజిషన్ కి చేరుకుంటానని చిత్తూరు యాసలో చెప్పారు. 

PREV
15
కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

25
విజయ్ దేవరకొండ స్పీచ్ 

ఇదిలా ఉండగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో అభిమానుల్లో జోష్ నింపుతూ ప్రసంగించారు. అయితే విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో తన రేంజ్ ఎలా ఉంటుందో విజయ్ దేవకొండ పుష్ప డైలాగ్ తో చెప్పకనే చెప్పాడు. విజయ్ దేవరకొండ తన ప్రసంగం మొత్తం చిత్తూరు యాసలోనే కొనసాగించాడు. 

35
చిత్తూరు యాసలో మాట్లాడిన విజయ్ దేవరకొండ 

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అందరూ బావుండాలి, అందరం బావుండాలి. ఈతూరి నేరుగా మీ కాడికే వచ్చినాము. ట్రైలర్ లేట్ అయినాది.. అయినా మీ అందరితో కలసి ట్రైలర్ చూసినాము. మీ అందరికీ ఒక మాట చెప్పాల. నేను యాడా బయట ఈ మాట చెప్పిందే లే. ఒక ఏడాది నుంచి కింగ్డమ్ సినిమా గురించి ఆలోచిస్తుంటే నా తలకాయలో ఒక్కటే తిరుగుతాంది. 

45
చానా పెద్దోడినై పూడుస్తా సామి  

మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గాని ఈ ఒక్క తూరి నా పక్కన ఉండి నన్ను నడిపించినాడా.. చానా పెద్దోడినై పూడుస్తా సామి. పోయి టాప్ లో కూర్చుంటా అని విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంటే కింగ్డమ్ మూవీ హిట్ అయితే తన రేంజ్ మారిపోతుందని విజయ్ పరోక్షంగా ఇలా చెప్పినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 

55
జూలై 31న కింగ్డమ్ రిలీజ్ 

జూలై 31న కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ చివరగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఈ మూవీపై విజయ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. 

Read more Photos on
click me!

Recommended Stories