రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ పీక్స్.. కింగ్డమ్ ట్రైలర్ చూశారా

Published : Jul 26, 2025, 11:22 PM IST

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్ర ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో హైలైట్స్ ఏంటి, కథ గురించి ఎలాంటి హింట్స్ ఇచ్చారు లాంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మించారు. జూలై 31న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. 

25

కింగ్డమ్ ట్రైలర్ లో యాక్షన్, విజువల్స్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం పనిచేసే స్పై పాత్రలో నటిస్తున్నారు. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు ఒక అండర్ కవర్ స్పైగా మారాలి అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 

35

విజయ్ దేవరకొండకి ఒక ఆపరేషన్ అసైన్ చేసి స్పైగా పంపిస్తారు. ఈ ఆపరేషన్ కోసం మీ అమ్మని, ఇంటిని, ఉద్యోగం అన్నీ వదిలేయాలి అంటూ కండిషన్స్ పెడతారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు విజయ్ దేవరకొండ చేయబోయే స్పై ఆపరేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో, అతడి పాత్ర ఎంత తీవ్రంగా ఉంటుందో అని. 

45

ఈ చిత్రంలో సత్యదేవ్.. విజయ్ దేవరకొండ సోదరుడి పాత్రలో నటిస్తున్నారు. అతడికి వ్యతిరేకంగానే విజయ్ దేవరకొండ సీక్రెట్ ఆపరేషన్ ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. చూస్తుంటే ఒక మాఫియా సెటప్ లో ఈ కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తన అన్న కోసం మొత్తం తగలెబెట్టేస్తా అని విజయ్ దేవరకొండ చెప్పడం ఆసక్తికరమైన ట్విస్ట్. 

55

ట్రైలర్ లో అక్కడక్కడా కేజీఎఫ్ తరహా ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ చివర్లో వీడు రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా కింగ్డమ్ ట్రైలర్ టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంది. విజువల్స్ ఒక గ్రాండ్ మూవీకి కావలసిన లుక్ ని తీసుకువచ్చాయి. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీలో లీనమయ్యేలా చేస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తన పాత్రలో చెలరేగిపోయాడు. అతడి పెర్ఫార్మెన్స్ పీక్స్ అనే చెప్పాలి. హీరోయిన్ భాగ్యశ్రీకి ట్రైలర్ లో ఎక్కువ స్పేస్ దొరకలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories