ప్రేమమ్, ఫిదా,ఎమ్ సీఎ, మారి 2, లవ్ స్టోరీ, శ్యామ్ సింహరాయ్, గార్గి ఇలా వరుసగా హిట్ సినిమాలు చేసిన సాయి పల్లవి ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటుంది. మేకప్ కూడా చాలా తక్కువ వేసుకుంటుంది. అసలు వేసుకోకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తాండల్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. సాయి పల్లవి 2015లో మలయాళ చిత్రం ప్రేమమ్‌తో తెరంగేట్రం చేసింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా 74.5 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కేరళలో 175 రోజులు, తమిళనాడులో 300 రోజులు థియేటర్లలో విజయవంతంగా రన్ అయింది.