సమంతను స్కూల్ వరకు ఫాలో అయ్యేవాడట. ఎప్పుడూ దగ్గరకు రాలేదట. కొన్ని అడుగుల దూరం లో ఉంటూ అనుసరించేవాడట. ఇంటర్ కూడా పూర్తి అయ్యిందట. రెండేళ్లుగా ఫాలో అవుతున్న అతని వద్దకు వెళ్లి... ఎందుకు నా వెనకాల పడుతున్నావ్... అని అడిగిందట. నేను నిన్ను ఫాలో కావడం ఏంటీ, అనేశాడట. దాంతో సమంత షాక్ అయ్యిందట.
అది ప్రేమో కాదో తెలియదు కానీ... అదే నా ఫస్ట్ లవ్ అని సమంత చెప్పుకొచ్చింది. సమంత మాటలను బట్టి చూస్తే సమంత కూడా అతన్ని ఇష్టపడింది. కానీ ఆ పిరికివాడు ధైర్యం చేయలేదు. అదన్నమాట సంగతి.
కొన్నాళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత చిత్రాలు తగ్గించారు. ఇటీవల మా ఇంటి బంగారం టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది. సమంత నటించిన యాక్షన్ సిరీస్ సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో హనీ బన్నీ టైటిల్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది...