స్క్రీన్ పై రొమాన్స్ చేసిన హీరోయిన్లను భార్యలుగా తెచ్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

Published : Sep 06, 2025, 01:32 PM IST

సినిమా సెట్స్‌లో మొదలైన ప్రేమ నిజ జీవితంలో పెళ్లిగా మారిన ఉదాహరణలు  చాలా ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్‌పై జంటగా కనిపించిన స్టార్ హీరోలు – హీరోయిన్స్ రియల్ లైఫ్ లోను  భార్యభర్తలుగా మారారు. ఇంతకీ వారెవరంటే? 

PREV
112

మహేష్ బాబు ‌– నమ్రత శిరోద్కర్‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ ప్రారంభ దశలోనే ప్రేమలో పడ్డాడు. 2000లో వచ్చిన వంశీ సినిమాలో కలసి నటించిన నమ్రత శిరోద్కర్‌ ను ప్రేమించి, ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు – గౌతమ్ , సితార.

212

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యతో విడాకుల అనంతరం బద్రి మూవీ సెట్స్‌లో పరిచయమైన రేణు దేశాయ్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు అఖిరా నందన్ , కూతురు ఆద్య. తర్వాత వీరు విడిపోయారు. తరువాత పవన్ కళ్యాణ్ రష్యన్ నటి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు.

312

నాగార్జున – అమల

అక్కినేని నాగార్జున ముందుగా స్టార్ హీరో వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విడాకుల అనంతరం, తనతో కలిసి శివ, నిర్ణయం, కిరాయి దాదా వంటి సినిమాల్లో నటించిన అమలను ప్రేమించి 1992లో వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు అఖిల్ అక్కినేని ఉండగా. మొదటి భార్య లక్ష్మి తనయుడు హీరో నాగచైతన్య.

412

నాగ చైతన్య – సమంత

నాగార్జున మొదటి భార్య కొడుకు నాగ చైతన్య, 2010లో ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన సమంతను ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధం 2021లో విడాకులతో ముగిసింది. తర్వాత నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ 2024 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

512

రాజశేఖర్ – జీవిత

సీనియర్ హీరో రాజశేఖర్, అంకుశం, ఆహుతి వంటి హిట్ చిత్రాల్లో కలసిన జీవితతో ప్రేమలో పడి, వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివాణి, శివాత్మిక. వీరిద్దరు కూడా టాలీవుడ్, కోలీవుడ్ లలో హీరోయిన్లు గా కొనసాగుతున్నారు.

న్నారు.

612

వరుణ్ తేజ్ – వితికా షేరు

యంగ్ హీరో వరుణ్ తేజ్, తనతో కలిసి నటించిన వితికా షేరుతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. వీరి జంటకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇద్దరు బిగ్ బాస్ లో కూడా సందడి చేశారు.

712

ఆర్య – సాయేషా

తమిళ నటుడు ఆర్య, సాయేషా సైగల్ తో కలిసి నటించిన అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2019లో ఘనంగా జరిగింది. వీరికి ప్రస్తుతం ఒక పాప కూడా ఉంది. మరో హిరో ఆది పినిశెట్టి కూడా తన తోటి హీరోయిన్ నిక్కీ గల్రానీని ప్రేమించి పెళ్లి చేసుకు

812

సూర్య – జ్యోతిక

తమిళ సినీ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికతో కలసి ఏడుకు పైగా సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించి, 2006లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి చదువుల కోసం ఈ స్టార్ కపుల్ రీసెంట్ గా ముంబయ్ కి మకాం మార్చేశారు.

912

వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరు సంవత్సరాల డేటింగ్ తర్వాత, జూన్ 2023లో ఎంగేజ్మెంట్ చేసుకుని, నవంబర్ 1, 2023న ఇటలీలోని టస్కానీలో వివాహం చేసుకున్నారు. వారు "మిస్టర్", "గండీవధరి అర్జున", "అంతరిక్షం 9000 KMPH" వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు.

1012

అజిత్ – షాలిని

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, అమర్ కలంతో సినిమాలో కలసిన షాలినితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ కథ అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. షాలినీ కూడా బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసి, హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అజిత్ భార్యగా ప్యామిలీ బాధ్యతలను చూసుకుంటోంది.

1112

కృష్ణ – విజయనిర్మల

పాత తరం టాలీవుడ్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ, అనేక సినిమాల్లో తనతో నటించిన విజయనిర్మలను వివాహం చేసుకున్నాడు. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కృష్ణకు ఇంతకు ముందే తన మేనమామ కూతురు ఇందిరతో వివాహం జరగ్గా, మహేష్ బాబుతో పాటు మరో నలుగురు పిల్లలు ఉన్నారు. విజయ్ నిర్మలకు కూడా కృష్ణతో పెళ్లి రెండవది కాగా, ఆమెకు మొదటి భర్తతో ఓ కుమారుడు ఉన్నాడు. ఆయనే టాలీవుడ్ స్టార్ యాక్టర్ నరేష్.

1212

అమితాబ్ బచ్చన్ – జయా బచ్చన్

బాలీవుడ్ కు వెళ్లితే, అమితాబ్ బచ్చన్, జయా భదూరితో కలిసి నటించిన అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు అభిషేక్ బచ్చన్, తన సహనటి ఐశ్వర్యా రాయ్ ను 2007లో వివాహం చేసుకున్నాడు. ఇలా మరికొందరు స్టార్స్ తమతో నటించిన హీరోయిన్లను పెళ్లాడి జీవితంలోకి ఆహ్వానించారు.

Read more Photos on
click me!

Recommended Stories