Ghaati Collections: అనుష్క శెట్టీ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి (Ghaati)సెప్టెంబర్ 5న వర్డల్ వైడ్ గా విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఘాటి మూవీ తొలి రోజు కలెక్షన్స్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Ghaati Collections: అనుష్క శెట్టి ‘బాహుబలి’తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత స్వీటి నుంచి ఎక్కువ సినిమాలు చేయకపోవడంతో, అభిమానులు కొత్త ప్రాజెక్ట్ కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. ఆ గ్యాప్ తర్వాత వచ్చిన మూవీనే ఘాటి (Ghaati). క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 5న వర్డల్ వైడ్ గా విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సినిమాను విడుదల చేశారు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఘాటి మూవీ తొలి రోజు కలెక్షన్స్ (Ghaati Day 1 Collections) షాకింగ్‌గా ఉండటం ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
25
భారీ అంచనా.. భారీ బడ్జెట్..
అనుష్క శెట్టీ యాక్షన్ అవతార్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ కాంబోగా తెరకెక్కిన మూవీ ‘ఘాటీ’. భారీ అంచనాల నడుమ విడుదైన ఈ సినిమాలో అనుష్క శెట్టీ జంటగా కోలీవుడ్ లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు, సీనియర్ హీరో ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు నటించారు. జగపతి బాబు, రాజు సుందరం, జాన్ విజయ్, జిష్షు సేన్ గుప్తా, లారిస్సా బోనేసి, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
సాయి మాధవ్ బుర్ర మాటలు రాయగా, చింతకింది శ్రీనివాసరావు కథ అందించారు. ఈ సినిమాకు విద్యాసాగర్ నాగవల్లి సంగీతం అందించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేశారు.
పెద్ద క్యాస్టింగ్‌తో పాటు సీనియర్ టెక్నీషియన్ల వర్క్ కూడా ఉండటంతో సినిమా బడ్జెట్ భారీగానే పెరిగింది. ట్రేడ్ టాక్ ప్రకారం ఘాటికి సుమారు ₹50 కోట్ల ఖర్చు అయినట్లు సమాచారం.
35
ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ?
నిజానికి ‘ఘాటీ’ సినిమా విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్‌లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు ₹52 కోట్ల వరకూ నమోదయింది. ప్రాంతాల వారీగా చూస్తే, నైజాం రైట్స్ ₹8 కోట్లు, ఆంధ్రా రైట్స్ ₹10 కోట్లు, సీడెడ్ రైట్స్ ₹5 కోట్లు, తమిళనాడు ₹9 కోట్లు, కర్ణాటక, కేరళ ₹5 కోట్లు, నార్త్ ఇండియా ₹5 కోట్లు, అలాగే ఓవర్సీస్ రైట్స్ ₹10 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఘాటి సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ₹55 కోట్ల షేర్, అంటే సుమారు ₹100 కోట్ల గ్రాస్ అవసరమని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. క్రిష్ టేకింగ్, అనుష్క ఇమేజ్ మీదనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉండనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఘాటి డే 1 కలెక్షన్స్ : అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ ఉన్నా, సినిమాపై క్రియేట్ అయినా హైప్ తో ఘాటి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, తొలి రోజు విరుద్ధంగా ఘాటి సినిమాకు ఊహించని కలెక్షన్స్ వచ్చాయి
సాక్నిల్క్ ప్రకారం రూ. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడిన తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 4 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ఇందులో ఇండియాలో నెట్ కలెక్షన్స్ సుమారు రూ. 2.5 కోట్లు అని తెలుస్తోంది. ఇది నిజంగా ట్రేడ్ వర్గాలకు షాకింగ్ ఫలితమే. రిలీజ్‌కు ముందే ₹10 కోట్లు దాటుతుందని అనుకున్నారు కానీ కలెక్షన్లు అలా రాలేదు.
55
ఎదురుదెబ్బకు కారణమేంటీ?
వినాయక నిమజ్జన కార్యక్రమాలు వద్ద సెప్టెంబర్ 5న పలు చోట్ల థియేటర్ ఫుట్‌ఫాల్ బాగా తగ్గిపోయింది. థియేటర్ ఆక్యుపెన్సీ కూడా తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సగటు ఆక్యుపెన్సీ 24% ఉండగా, తమిళనాడులో 19% మాత్రమే నమోదు కావడం శోచనీయమే. అలాగే.. ఎన్నో అంచనాలతో విడుదలైన అనుష్క- క్రిష్ కాంబో మూవీ
మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి షోల నుంచే సినిమా నెగటివ్/మిక్స్‌డ్ టాక్ రావడం వల్ల కూడా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడింది. ఇప్పుడంతా శని, ఆదివారపు కలెక్షన్స్ మీదే ఆధారపడి ఉంది. వీకెండ్‌లో కాస్త రెస్పాన్స్ మెరుగుపడితే, సినిమా సెటిల్ అయ్యే అవకాశం ఉంది.
కానీ కలెక్షన్లు ఇలాగే స్లోగా సాగితే, బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమేనని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. మొత్తానికి, అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ ఉన్నా ‘ఘాటి’ తొలి రోజు వసూళ్లు అంచనాలకు తగ్గట్లేకపోవడం నిజంగా నిరాశపరిచే అంశం.