సౌందర్య అప్పుడు యంగ్ హీరోలు మహేష్, పవన్‌లతో సినిమాలు మిస్ అయ్యాయి. డేట్స్ సెట్ కాక, మిస్ కాస్టింగ్ అనే కోణంలో కుదరలేదు. అయితే ఉదయ్ కిరణ్‌తో కలిసి సౌందర్య సినిమా చేసింది. అదే `నర్తనశాల`. బాలకృష్ణ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమిది.
పౌరాణికంగా తెరకెక్కించారు. పాండవుల వనవాసం ఎపిసోడ్‌ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు బాలయ్య. ఈ మూవీ ఒకటి, రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. కానీ ఆ సమయంలోనే సౌందర్య హెలీకాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో సినిమా ఆగిపోయింది.