ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ప్రభాస్ తో పాటు విశాల్ కూడా ఉన్నాడు. 47 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్ళి పీటలు ఎక్కలేదు ఈ స్టార్ హీరో. ఇక తాజాగా విశాల్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. నిజం ఎంత?
15
Vishal
స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెన్నైలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈ హీరో, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు విశాల్. పందెం కోడి సినిమాతో అటు తమిళంలో ఇటు తెలుగులో రెండు చోట్లా ఒకేసారి స్టార్ డమ్ వచ్చింది విశాల్ కి. పందెం కోడి సినిమా తరువాత వరుసగా విశాల్ ఖాతాలో హిట్ మీద హిట్లు పడ్డాయి. ఇక నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా విశాల్ సక్సెస్ అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు.
తమిళనాట సినిమా ఇండస్ట్రీలో ఎంత పోటీ ఉంటుందో అందరికి తెలిసిందే. ఆ పోటీని పేస్ చేసి, నాన్ లోకల్ అని కొంత మంది విమర్శిస్తున్నా, ఎదురించి పోరాడాడు. అంతే కాదు నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కూడా గెలిచాడు. నడిగర్ సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా చేశాడు విశాల్. ఇలా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు విశాల్. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న విశాల్ తన కెరీర్ లో ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేశాడు. రాజకీయాలలో అప్పుడప్పుడు అలా ఓ చేయివేస్తూ.. ఎన్నో వివాదాలకు కేంద్రగా మారాడు.
35
vishal Engagement
ఇక విశాల్ 50 ఏళ్ళకు చాలా దగ్గరగా ఉన్నాడు. కాని పెళ్లి మాత్రం చేసుకోలేదు. రెండు సార్లు చేసుకుందాం అని ఎంగేజ్మెంట్ వరకూ వచ్చినా.. రకరకాల కారణాల వల్ల అవి కాన్సిల్ అవ్వడం జరిగింది. అప్పట్లో.. అర్జున్ రెడ్డి సినిమాలో నటించి అమ్మాయితో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. కాని పెళ్ళి టైమ్ వచ్చే వరకూ అది క్యాన్సిల్ అయ్యింది. అయితే విశాల్ స్వయంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాడన్న రూమర్స్ కూడా ఉన్నాయి.
45
that childhood friend abhinaya mentioned is vishal social media rumours
ఇక ఈమధ్య విశాల్ నటి అభిమనయను పెళ్ళాడబోతున్నట్టు వార్తలుక వైరల్ అయ్యాయి. అభినయ తెలుగు అమ్మాయి. సౌత్ లో లో దాదాపు అన్ని భాషల్లో నటించింది. కాని ఆమె పుట్టుకతో మూగ, చెవిటి. అయినా సరే నటన విషయంలో ఏమాత్రం తగ్గకుండా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె శంభో శివ శంభో, కింగ్, ఢమరుకం, నేనింతే, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది2, సీతా రామం, ఇలా వరుస సినిమాలలో అద్భుతమైన నటన ప్రదర్శించింది.
55
ఈ నటిని విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నాడని చాలా కాలంగా సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అయితే తాజాగా అభినయ ఓ పోస్ట్ పెట్టింది. చేతిలో చేయి వేసిన ఫోటోను పోస్ట్ చేసిన ఈ అమ్మాయి.,తన ఎంగేజ్మెంట్ జరిగినట్టు ప్రకటించింది. అయితే విశాల్ సీక్రేట్ గా అభియతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
కాని మరో వాదన ఏంటంటే..అభినయ చిన్నతనం నుంచి ప్రేమించిన అబ్బాయిని పెళ్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. మరి అభినయ పెళ్లి ఎవరితోనో తెలియదు కాని.. విశాల్ లో లింక్ చేసి రకరకాల వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. నిజమేంట్ తెలియాల్సి ఉంది. ఇక విశాల్ ను పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం.. ప్రభాస్ చేసుకున్న తరువాత చేసుకుంటూ అంటూ చాలా సందర్భాల్లో దాటేస్తూ వచ్చాడు.