శోభిత ధూళిపాళ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, అతన్ని అంతలా ప్రేమించిందా?

Published : Mar 12, 2025, 08:03 AM ISTUpdated : Mar 12, 2025, 01:54 PM IST

నాగచైతన్యను ప్రేమించి పెళ్ళాడిన శోభిత ధూళిపాళ.. తన ఫస్ట్ క్రష్ గురించి ఓ సందర్భంలో వెల్లడించింది. చైతూ కంటే మందు ఒకతనిపై మనసుపడ్డట్టు ఆమె వెల్లడించింది. ఇంతకీ అతను ఎవరు? శోభిత ప్రేమ కథ ఏంటి? 

PREV
15
శోభిత ధూళిపాళ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, అతన్ని అంతలా ప్రేమించిందా?
Naga Chaitanya,Sobhita Dhulipala,Naga, Samantha Ruth

సమంతకు విడాకులు ఇచ్చిన తరువాత కొంత కాలానికి హీరోయిన్ శోభిత ప్రేమలో పడ్డాడు  నాగచైతన్య. శోభిత కూడా చైతూను గాఢంగా ప్రేమించింది. అందరిని ఒప్పించి పెళ్ళాడింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో  వీరి వివాహం చాలా తక్కువ మంది అతిధుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. నాగచైతన్య రెండు సార్లు ప్రేమలో పడ్డాడు.. మరి శోభిత సంగతేంటి.  గతంలో ఆమెకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా?  ఆమె ఫస్ట్ లవ్ ఎవరు? ఫస్ట్ క్రష్ ఎవరు? ఈ విషయాలను ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.? 

Also Read: కీర్తి సురేష్ భర్త ఆంటోనీ కంటే పెద్దదా? వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత?
 

25

శోభిత ధూళిపాళ సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. తెనాలి ఆమె సొంత ఊరు. చిన్నతనం నుంచి సినిమా వాతావరణానికి దూరంగా పెరిగిన శోభిత, కనీసం టీవి కూడా చూడలేదు. వారి ఫ్యామిలీలో కూడా సినిమాల పెద్దగా అలవాటు లేవు, టీవీలు కూడా చూసేవారు కాదని తెలుస్తోంది. సినిమాలు టచ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన శోభిత, అనుకోకుండా మోడలింగ్ లోకి వెళ్ళింది. ఆతరువాత బాలీవుడ్లో ఆఫర్లు అందుకుని.. తన కెరీర్ ను అక్కడే స్టార్ట్ చేసింది. 

 

35

ఇక శోభిత స్కూల్ డేస్ లో ఒక అతన్ని ప్రేమించింది. ఓ ఇంట్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. అది ప్రేమో, ఏమో తెలియదు కాని.. స్కూల్ లో ఉన్నప్పుడు తమ క్లాస్ లీడర్ పై ఇంట్రెస్ట్ ఉండేదని. కాని అది అక్కడే ఆగిపోయిందని అన్నది శోభిత.  

స్కూల్ లో తననే చూసేదాన్ని, అతని దృష్టిలో పడాలని ఆరాటపడేదాన్ని. రకరకాలుగా రెడీ అయ్యి వచ్చేదాన్ని. కాని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అతను నా వైపు చూసేవాడు కాదు. దాంతో కాస్త  డిస్సపాయింట్ అయినా.. నా పని మాత్రం నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అని అంటుంది శోభిత. 

Also Read:సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

45

ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చిన తరువాత తనకు చాలా లవ్ లెటర్స్ వచ్చేవట. తాను కూడా కొన్ని లెటర్స్ రాశానని అంటోంది. అప్పుడు అవన్నీ తెలియకుండానే జరిగిపోయాయి. కాని మోడలింగ్ ఎంచుకున్న తరువాత కెరీర్ పైనే దృష్టి పెట్టానని చెప్పింది శోభిత. మోడలింగ్ చేస్తూనే బాలీవుడ్  లోకి అడుగు పెట్టింది ఈ స్టార్ హీరోయిన్.

తెలుగులో కొన్ని సినిమాలు చేసిన శోభిత నాగచైతన్య ప్రేమలో పడింది. అయితే సోషల్ మీడియా సమాచారం ప్రకారం శోభిత నాగచైతన్యను, సమంతతో పెళ్ళి అవ్వకముందే ప్రేమించిందని.. వారి ఇంటికి కూడా వచ్చేదని సమాచారం. 

Also Read: 2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?

55

మొత్తానికి తమ ప్రేమను నిలబెట్టుకున్నారు ఇద్దరు స్టార్లు. దాదాపు మూడేళ్ళు ప్రేమించుకున్న ఈ జంట.. ఈ విాషయం తెలియకుండా రహస్యంగా ఉంచాలని చూశారు. కాని కొన్ని సందర్భాల్లో వీరి ప్రేమ బయటపడింది. ఫారెన్ లో  డేటింగ్ లతో ఇద్దరు బయటపడ్డారు. దాంతో వీరిపై రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. చివరకు పెళ్ళి వార్త వినిపించారు ఇద్దరు తారలు.  ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఈ స్టార్ కపుల్. 
 

Read more Photos on
click me!

Recommended Stories