మహేష్ ఫ్యాన్స్ కు పండగే: రెంట్ లేకుండా 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌'

Published : Mar 12, 2025, 06:25 AM ISTUpdated : Mar 12, 2025, 06:29 AM IST

Mahesh babu: 'ముఫాసా: ది లయన్ కింగ్' చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రెంట్ విధానంలో  ఫిబ్రవరి 18 నుంచి అందుబాటులో ఉంది. ఇప్పుడు అటువంటివేమీ లేకుండా ఓటిటిలోకి వస్తోంది. 

PREV
13
మహేష్ ఫ్యాన్స్ కు పండగే:  రెంట్ లేకుండా  'ముఫాసా: ది లయన్‌ కింగ్‌'
Mufasa The Lion King OTT Release When & Where to Watch in telugu


Mahesh babu: హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ది లయన్‌ కింగ్‌ (2019)’కు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.  

బారీ జెంకిన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ బ్యానర్ పై  అడెలె రోమన్‌ స్కీ, మార్క్‌ సెరియాక్‌ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానుంది.  

23
Mufasa The Lion King OTT Release When & Where to Watch in telugu

‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రం ఫిబ్రవరి 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రెంటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చింది.

అయితే  మార్చి 26,2025 నుంచి రెంట్ లేకుండా రెగ్యులర్ గా జియో హాట్ స్టార్ లో అన్ని భాషల్లోనూ   ఉచితంగా  ప్రీమియర్ అవుతుంది.  ఇది ఖచ్చితంగా మహేష్ బాబు అభిమానులకు ఆనందం కలిగించే విషయమే. ఎందుకంటే ఇప్పుడు తమ అభిమాన హీరో వాయిస్ ని వారు వింటూ సినిమా చూడవచ్చు. 

 

33
Mufasa The Lion King OTT Release When & Where to Watch in telugu

ఇంగ్లిష్‌, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో  విడుదలైన  ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రంలో టైటిల్‌ రోల్‌కు టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది.

హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ ఖాన్‌, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్‌  అందించారు. ఈ చిత్రంలోని  సింబా పాత్రకు షారుక్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ ఇవ్వడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories