పెళ్లైన 4 నెలలకు తమిళ హీరోతో జోడి కట్టబోతున్న శోభిత ధూళిపాళ
నాగచైతన్యతో పెళ్లై నాలుగు నెలలు అవుతుంది. ఇన్ని నెలలు యాక్టీవ్ గా లేని శోభిత.. త్వరలో తమిళ హీరోకి జోడీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్యతో పెళ్లై నాలుగు నెలలు అవుతుంది. ఇన్ని నెలలు యాక్టీవ్ గా లేని శోభిత.. త్వరలో తమిళ హీరోకి జోడీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్యతో పెళ్ళి తరువాత ఫ్యామిలీకే పరిమితం అయ్యింది శోభిత ధూళిపాళ. ఇక ఆమె సినిమాలు మానేస్తుంది అనుకున్నారు అంతా. ఈ విషయంలో కొోన్ని రూమర్లు కూడా వినిపించాయి. కాని అందులో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆమె యాక్టీవ్ అవుతోంది. కొన్ని సినిమాలకు కూడా ఆమె సైన్ చేసినట్టు తెలుస్తోంది. పెళ్ళైన 4 నెలలకు శోభిత ఇండస్ట్రీలో బిజీ కాబోతోంది.
Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?
కబాలీ ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్, పార్వతి తదితరులు నటించిన 'తంగలన్' సినిమా గత ఏడాది విడుదలైంది. కాని ఈసినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి వచ్చిన స్పందనతో నిరాశలో ఉండగా. పా రంజిత్ ప్రస్తుతం అట్టకత్తి దినేష్ తో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'వేట్టువం' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో దినేష్ కు విలన్ గా ఆర్య నటిస్తున్నట్లు సమాచారం.
Also Read: 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?
పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'అట్టకత్తి' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన దినేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం లబ్బర్ బంతి విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ తర్వాత ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో రూపొందనున్న 'వేట్టువం' చిత్రంలో నటిస్తున్నాడు.
Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో దినేష్ సరసన శోభిత ధూళిపాళ నటించనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు కొన్ని పుకార్లు రాగా, ప్రస్తుతం వాటికి చెక్ పెడుతూ పెళ్లయిన 4 నెలలకే మళ్లీ నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?
వేట్టువం సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ 18న పూందమల్లి ప్రాంతంలో ప్రారంభమవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో తంజావూరు ప్రాంతంలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా తంజావూరు ప్రాంతంలో 20 రోజుల పాటు షూటింగ్ జరగనుందట. తంగలన్ సినిమా షూటింగ్ సమయంలోనే తన తదుపరి సినిమాకు ఇక్కడ షూటింగ్ చేయాలని రంజిత్ ప్లాన్ చేశారట. ఆయన ప్లాన్ ప్రకారమే ఇక్కడ షూటింగ్ జరగనుందట.