దాంతో కాంతారా సినిమాకు , ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా 1 చాప్టర్ సినిమాను ఏకంగా 125 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈసినిమాలో కాంతారాల చరిత్రను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. అందు కోసం అతను కూడా చాలా కష్టపడుతున్నాడు.
రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం ప్రత్యేకంగా ఫైటింగ్ సీన్ డిజైన్ చేయించారు. కొన్ని సీన్స్ కోసం 3 నెలలు ఆయన కలరి ఫైట్, గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రాక్టీస్ చేశాడు.ఈ ప్రాచీన విద్యలను నేర్చుకోవడం అంత సులువైన పని కాదు. కాని సినిమా మీద ప్రేమతో రిషభ్ శెట్టి ఇంత కష్టపడుతున్నాడు.
Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?