`నాగబాబు గుర్తుపెట్టుకో, అమ్మానాన్నలను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకో. ప్రేమగా చూసుకో, అమ్మా నాన్నలకు ప్రత్యామ్నాయం లేదు` అని చెప్పారు శోభన్ బాబు.
అప్పటికే మేం అదే జోన్‌లో ఉన్నాం. బాగానే చూసుకుంటున్నాం. కానీ ఆయన ఆ మాట అన్నాక, అది మరింత బలంగా తయారైంది, నా గుండెలో బలంగా నాటుకుపోతుంది` అని చెప్పారు నాగబాబు.
ఈ సందర్భంగా అందరిని ఉద్దేశించి ఆయన చెబుతూ, పేరెంట్స్ ఏం తప్పు చేశారు? ఏ నువ్వు వెళ్లి మాట్లాడలేవా? ఏ తండ్రి ఫెయిల్ కాదు. ఏరా నాన్న తిన్నావా? ఏం చేస్తున్నావ్ అంటే అందులో ప్రేమ లేదా?` అంటూ ప్రశ్నించారు నాగబాబు.
ఈ సందర్భంగా శోభన్ బాబు చెప్పిన ఆ మాటలు తనకు బలంగా నాటుకుపోయానని చెప్పారు నాగబాబు. ఆయన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.