ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ పెట్టింది. ఇందులో రష్మి గౌతమ్ చెబుతూ, `ఒక నెల రోజులపాటు డిజిటల్ డీటాక్స్ పాటించాలని అనుకుంటున్నా, వ్యక్తిగతంగా, వృత్తిగతంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.
అందులో సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. కొన్నిసార్లు అది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఈ సందర్భంగా ఒక విషయం అయితే వాగ్దానం చేస్తున్నా, కచ్చితంగా నేను మరింత దృఢంగా తిరిగి వస్తాను.
నేను వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రేరణ, డిజిటల్ ప్రభావం లేకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనెప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నేనూ కుంగిపోతున్నా.
కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. నేను మీకు అందుబాటులో లేకుండా, మీ ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా` అని వెల్లడించింది రష్మి గౌతమ్.