సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దుమ్మురేపుతున్నాడు అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఆయన చేతిలో తెలుగు,తమిళం కలిపి అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. రజినీకాంత్ 'కూలీ', విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్', విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', శివకార్తికేయన్ 'మదరాసి', తలపతి విజయ్ 'జననాయకన్' వంటి సినిమాలు ఉన్నాయి. రాబోయే ఆరు నెలల్లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో సంగీత దర్శకత్వంలో బిజీగా ఉన్న అనిరుధ్, అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి సంగీత కచేరీలు కూడా నిర్వహిస్తున్నారు.