శోభన్ బాబు హీరోగా మాత్రమే సినిమాలు చేశారు. ఆతరువాత ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఎంత మంది ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. ఆయన సహాయ పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు. గొప్ప గొప్ప పాత్రలెన్నో వచ్చినా.. ఇంటిదాకా వెళ్ళి బ్రతిమలాడినా శోభన్ బాబు నో అనేసేవారు.
తన అభిమానులు తనను అందాల నటుడిగా, హీరోగానే అభిమానించారని. ముసలి పాత్రలు చేస్తే.. తనను యాక్సప్ట్ చేయరని భావించిన శోభన్ బాబు.. 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆతరువాత తన ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు శోభన్ బాబు.
Also Read: సౌందర్య చివరిగా నటించి, నిర్మించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?