చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు పోసాని రచయితగా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చాక పోసాని పవన్ కళ్యాణ్ పై, మెగా ఫ్యామిలీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే మెగా ఫ్యామిలీ హీరోల చిత్రాలకు పోసాని రచయితగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన అల్లుడా మజాకా చిత్రానికి కథ అందించింది పోసాని కావడం విశేషం. ఆ చిత్రం హిట్ అయినప్పటికీ డైలుగులు, వల్గారిటీ వల్ల విమర్శల పాలైంది.