`డ్రాగన్‌` హీరోయిన్‌ సెన్సేషన్‌ కయాదు లోహర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే?. అస్సాం టూ చెన్నై వయా బెంగుళూరు

Published : Feb 27, 2025, 02:37 PM ISTUpdated : Feb 27, 2025, 06:16 PM IST

Kayadu Lohar: తమిళంలో రూపొందిన `డ్రాగన్‌` సినిమాతో సంచలనంగా మారింది కయాదు లోహర్‌. ఇప్పుడు ఆమె వైరల్‌ అవుతుంది. మరి ఇంతకి ఈ కయాదు లోహర్‌ ఎవరు? ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో చూస్తే.   

PREV
18
`డ్రాగన్‌` హీరోయిన్‌ సెన్సేషన్‌ కయాదు లోహర్‌  బ్యాక్‌ గ్రౌండ్‌  ఇదే?. అస్సాం టూ చెన్నై వయా బెంగుళూరు
kayadu lohar

Kayadu Lohar: తమిళంలో గత వారం విడుదలైన `డ్రాగన్‌` మూవీ సంచలనంగా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పటికే యాభై కోట్లు దాటింది. వంద కోట్ల దిశగా వెళ్తుంది. ఇందులో నటించిన నటీనటులను ఓవర్‌ నైట్‌లో స్టార్లని చేసింది.

అయితే ఈ మూవీ ద్వారా ఓ వ్యక్తి ఇప్పుడు సౌత్‌ సెన్సేషన్‌గా మారింది. ఆమెనే హీరోయిన్‌ కయదు లోహర్‌. `రిటర్న్ ఆఫ్‌ ది డ్రాగన్‌` మూవీలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించగా, ఆయనకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించారు. 
 

28
Dragon

ఇందులో పల్లవి పాత్రలో కనిపించింది కయాదు లోహర్‌. ఆమె హీరోని పెళ్లిచేసుకునేందుకు రెడీ అయిన అమ్మాయి. ఈ సినిమాలో కయాదు బాగా పాపులర్‌ అయ్యింది. ఆమె అనుపమాని కూడా డామినేట్‌ చేసే స్థాయిలో ఆకట్టుకుంది.

దీనికితోడు తనదైన గ్లామర్‌తోనూ రచ్చ చేసింది. కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. ఓరకంగా వారిని హంట్‌ చేస్తుంది. దీంతో ఇప్పుడు యంగ్‌ సెన్సేషన్‌గా మారింది కయాదు లోహర్‌. 

38
kayadu lohar

24ఏళ్ల కయాదు లోహర్‌ ఇప్పుడు సౌత్‌లో కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారింది. అంతకు ముందు `ప్రేమలు` హీరోయిన్‌ మమితా బైజు, అలాగే తెలుగు బ్యూటీ శ్రీలీల, మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి శెట్టి మాదిరిగానే ఇప్పుడు కయాదు లోహర్‌ సంచలనంగా మారింది.

అంతా ఆమె గురించి తెలుసుకుంటున్నారు. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ని సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కయాదు గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. మరి ఇంతకి ఈ కయాదు లోహర్‌ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఇంతకు ముందు ఏ ఏ సినిమాలు చేస్తుందనేది చూస్తే. 
 

48
kayadu lohar

కయాదు లోహర్‌ ది అస్సాం. అక్కడే పుట్టి పెరిగిన కయాదు లోహర్‌.. కామర్స్ లో గ్రాడ్యూయేట్‌ చేసింది. గ్రాడ్యూయేట్‌ సమయంలో మోడలింగ్‌లో పాల్గొంది. ప్రారంభంలో జ్యూవెల్లరీ యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఫ్రెష్‌ ఫేస్‌ ఫ్యాషన్‌ వీక్‌ సీజన్‌ 12 లో పాల్గొంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించింది.

58
kayadu lohar

ఈ సమయంలోనే ఆమెకి సినిమా మేకర్స్‌ కళ్లల్లో పడింది. ఇందులో చూసే మేకర్స్ కన్నడ మూవీ `ముగిల్‌పేట` అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.  తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. కానీ బ్రేక్‌ రాలేదు.

ఆ తర్వాత వరుసగా మలయాళంలో `పతోన్‌ పతం నూట్టండు`, తెలుగులో `అల్లూరి`, మరాఠిలో `ఐ ప్రేమ్‌ యు`, మలయాళంలో `ఓరు జాతి జాతకం` వంటి చిత్రాలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 

read more: `డ్రాగన్` మూవీ దెబ్బతో నయనతార జాక్ పాట్‌.. భార్యాభర్తలకు లక్‌ మామూలుగా లేదుగా
 

68
kayadu lohar

తెలుగులో ఆమె `అల్లూరి` సినిమాలో మెరిసినా మన మేకర్స్, ఆడియెన్స్ పెద్దగా ఫోకస్‌ చేయలేదు. కానీ ఇప్పుడు `డ్రాగన్‌` లో మెరవడంతో, ఇందులో ఆమె తనదైన గ్లామర్‌తో, నటనతో మెప్పించడంతో, ఈ మూవీ పెద్ద విజయం సాధించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది.

దీనికితోడు సోషల్‌ మీడియాలో ఆమె గ్లామర్‌ ట్రీట్‌ వేరే లెవల్‌లో ఉందని చెప్పొచ్చు. అందుకే నెటిజన్లు అంతా ఆమె వెంటపడుతున్నారు. వైరల్‌ చేస్తున్నారు.

read  more: చిరంజీవితో రాజమౌళి సినిమా చేస్తే మనశ్శాంతి ఉండదు, విజయేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు.. అడ్డుపడింది అతనేనా?

78
kayadu lohar

ముఖ్యంగా ఓ ఫోటో ఇప్పుడు అందరిని షేక్‌ చేస్తుంది.  `డ్రాగన్‌` సక్సెస్‌తో ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్‌ వచ్చిందట. విశ్వక్‌ సేన్‌ హీరోగా అనుదీప్‌ రూపొందిస్తున్న `ఫంకీ` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందట.

వీటితోపాటు మరికొన్ని తెలుగు సినిమాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది, రెండేళ్లలో స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో కయాదు లోహర్‌ చేరిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా అస్సాంలో పుట్టిన కన్నడలో గుర్తింపు తెచ్చుకుని, కోలీవుడ్‌లో పాపులర్‌ అయి ఇప్పుడు టాలీవుడ్‌ లో సెటిల్‌ కావడానికి వస్తుంది కయాదు. 
 

88
kayadu lohar

ఇక `డ్రాగన్‌` సినిమాకి తెలుగులో వస్తున్న స్పందనపై, తెలుగు ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమలో కయాదు స్పందించింది. `నేను తెలుగు నేర్చుకుంటా. మీ అందరి ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. మీరు పెద్ద హృదయంతో నన్ను స్వాగతించారు. మీ ప్రేమ నాకు చాలా చాలా స్పెషల్‌. త్వరలో టాలీవుడ్‌లోకి వస్తున్నా` అని తెలిపింది. ఆమె వీడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. 

read  more: ఎన్టీఆర్‌ మెచ్చిన బెస్ట్ డాన్సర్‌ ఎవరు? చిరంజీవి, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌ అసలు లిస్ట్ లోనే లేరు

also read: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై కొత్త సస్పెన్స్, బాలకృష్ణ అంత డేర్‌ చేస్తాడా? ఏంటీ అయోమయం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories