తన ఫాలోవర్స్ కు సితార వార్నింగ్
సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వడం, లేదా వారి పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక తన పేరుతో ఫేక్ అకౌంట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయంటూ సితార తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చింది. “ఫేక్ అకౌంట్ల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. నా పేరుతో కొన్ని అకౌంట్లు నడుస్తున్నట్లు తెలిసింది. అందుకే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అభిమానులకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను – నాకు కేవలం ఒకే ఒక్క అకౌంట్ ఉంది. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో నాకు అకౌంట్లు లేవు. దయచేసి జాగ్రత్తగా ఉండండి,” అని సితార తన పోస్ట్‌లో పేర్కొంది.