విజయశాంతి గతంలో స్టార్ హీరోలకు ధీటుగా లేడీ సూపర్ స్టార్ గా రాణించారు. అప్పట్లో విజయశాంతి ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. విజయశాంతి కమర్షియల్ చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణిస్తూనే ఇలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సత్తా చాటారు. కొన్నిసార్లు విజయశాంతి తన చిత్రాలతో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చేవారు.
DID YOU KNOW ?
బాలకృష్ణతోనే ఈజీ
తాను నటించిన స్టార్ హీరోల్లో బాలయ్యతో నటించడం సులభం అని విజయశాంతి అన్నారు. ఎందుకంటే బాలయ్యతో ఆ చనువు, వైబ్ ఉంటుందని పేర్కొన్నారు.
25
విజయశాంతి, బాలకృష్ణ కాంబినేషన్
ఒక సందర్భంలో విజయశాంతి ప్రభంజనం వల్ల నందమూరి బాలకృష్ణ నటించిన ఒక చిత్రం దారుణంగా దెబ్బ తినింది. వాస్తవానికి బాలకృష్ణ, విజయశాంతి వెండితెరపై సూపర్ హిట్ జోడిగా గుర్తింపు పొందారు. రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించారు. విజయశాంతి బాలయ్యతో రొమాన్స్ చేయడమే కాదు బాక్సాఫీస్ బరిలో పోటీ పడి విజయం సాధించింది కూడా.
35
బాలయ్యతో బాక్సాఫీస్ వార్
విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రం 1985 అక్టోబర్ 11న రిలీజ్ అయింది. అదే రోజున బాలకృష్ణ నటించిన కత్తుల కొండయ్య చిత్రం రిలీజ్ అయింది. ప్రతిఘటన చిత్రం విప్లవాత్మక కథతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న గోపీచంద్ తండ్రి టి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజశేఖర్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, చరణ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
బాలకృష్ణ కత్తుల కొండయ్య చిత్రం ఎస్ బి చంద్రవర్తి దర్శకత్వంలో రూపొందింది. మాస్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రంలో సుమలత హీరోయిన్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వర రావు కీలక పాత్రల్లో నటించారు. విజయశాంతి ప్రతిఘటన ధాటికి కత్తుల కొండయ్య చిత్రం కనిపించకుండా పోయింది.
55
డైరెక్టర్ టి కృష్ణ, విజయశాంతి మూవీస్
విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా ఎదగడంలో కీలక పాత్ర వహించిన దర్శకుల్లో ప్రతిఘటన డైరెక్టర్ టి కృష్ణ ఒకరు. విజయశాంతితో ప్రతిఘటనతో పాటు నేటి భారతం, వందేమాతరం, రేపటి పౌరులు లాంటి చిత్రాలని టి కృష్ణ తెరకెక్కించారు.