చిరంజీవి, బాలయ్య వచ్చినా కాలు మీద కాలు తీయని సిల్క్ స్మిత ఆ కమెడియన్‌ వస్తే లేచి నిలబడుతుంది.. ఎవరా నటుడు?

Published : Mar 15, 2025, 09:50 AM IST

 Silk Smitha: బోల్డ్ సెన్సేషన్‌ వ్యాంప్‌ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన సిల్క్ స్మిత సెట్‌లో యాటిట్యూడ్‌ చూపించేదట. పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఝలక్ ఇచ్చేదట. కానీ ఓ కమెడియన్‌కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇచ్చేదట. ఆ కథేంటో చూద్దాం. 

PREV
15
చిరంజీవి, బాలయ్య వచ్చినా కాలు మీద కాలు తీయని సిల్క్ స్మిత ఆ కమెడియన్‌ వస్తే లేచి నిలబడుతుంది.. ఎవరా నటుడు?
chiranjeevi, silk smitha

 Silk Smitha: సిల్క్ స్మిత అంటే ఒకప్పుడు సంచలనం. ఆమె కోసం పెద్ద పెద్ద స్టార్స్ సైతం వెయిట్‌ చేసేవాళ్లు. సినిమాలను వాయిదా వేసుకునే వారు. అంతటి క్రేజ్‌ ఆమె సొంతం. అయితే అదే రేంజ్‌లో యాటిట్యూడ్‌ కూడా ఉండేదట. ఎంత పెద్ద హీరోఅయినా సరే, చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్స్ ఉన్నా సరే సెట్లో కాలు మీద కాలేసుకుని కూర్చునేదట. కానీ ఓ కమెడియన్‌ వస్తే మాత్రం లేచి నిలబడేదట. మరి ఆ కమెడియన్ ఎవరనేది చూస్తే. 

25
Silk Smitha

సిల్క్ స్మిత తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సంచలనం, మరో విషాదం. ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆమె లైఫ్‌ ఏం చేయాలో, ఏం చేయకూడదో నేర్పించే పాఠం. సిల్క్ స్మిత తన లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు చూసింది. తిండికి లేని పరిస్థితి నుంచి డబ్బల కట్టలపై నిద్రపోయే స్థాయికి ఎదిింది. అమాయకంగా కొందరిని నమ్మింది. మోసపోయింది. చివరికి తన ప్రాణాలనే వదిలేసుకుంది. 

35
silk smitha

సిల్క్ స్మిత కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందట. చాలా మంది తనని తక్కువ చేసి చూసేవారట. లోకువ చేసి మాట్లాడేవారట. ఏమాత్రం రెస్పెక్ట్ ఇచ్చేవారట. దీంతో అనేక అవమానాలను ఆమె ఫేస్‌ చేసిందట. 

 క్రమ క్రమంగా తనకు పేరు వచ్చింది. బ్రేక్‌ వచ్చింది. మోస్ట్ వాంటెడ్‌ ఆర్టిస్ట్ అయిపోయింది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ వంటి పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె డేట్స్ కోసం వెయిట్‌ చేసే పరిస్థితి నెలకొంది. స్టార్‌ హీరోలను మించిన క్రేజ్‌ ఆమెకి ఓ దశలో వచ్చింది. 

45
babu mohan

అయితే సిల్క్ స్మిత ఎవరినీ వదిలేది కాదట. అందరిపై తన రివేంజ్‌ తీర్చుకునేదట. తనని ఎలా అయితే అవమానించారో, అలానే తాను కూడా తగ్గేది కాదట. సెట్‌లో కాలు మీద కాలేసుకుని కూర్చునేదట. చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినా కూడా కాలు మీద కాలుతీసేది కాదట.

కానీ అప్పట్లో స్టార్‌ కమెడియన్‌గా రాణించిన బాబుమోహన్‌ వస్తే మాత్రం కాలు మీద కాలు తీసి, లేచి నిలబడేదట. ఈ విషయాన్ని బాబు మోహన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు తనకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేదట. బాస్‌ అని పిలిచేదన్నారు. తనని అర్థం చేసుకున్న వ్యక్తి మీరే అని చెప్పేదట. 
 

55
Silk Smitha

ఓ సారి ఫారెన్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు తనని షాపింగ్‌కి తీసుకెళ్లిందని, అందులో నల్లని స్టయిలీష్ కళ్లజోడు కొనుక్కుని ఎలా ఉందో అడిగిందట. తాను బాగుందని చెబితే ఆ తర్వాత తీసి తనకు పెట్టిందట. ఆయన కూడా ఆ కళ్లజోడులో హీరోల కనిపించాడు. దీంతో ఆయనకే ఇచ్చేసిందట. దాని కాస్ట్ అప్పట్లోనే వేలల్లో ఉండేదట.

అయినా తన కోసం ఆ కళ్లజోడు ఇచ్చిందని చెప్పాడు బాబుమోహన్‌. తనని ఆమె బాస్‌ అని పిలిచేదని, బాధలన్నీ చెప్పుకునేదన్నారు బాబుమోహన్‌. సెట్‌లో నల్లని కళ్లజోడు పెట్టుకుని కూర్చునేదని, ఎవరెవరు తనని గమనిస్తున్నారు? ఎవరెవరు తనని చూస్తున్నారని అన్నీ గమనించేదట. దాన్ని బట్టి ఎవరు ఏంటో తెలుసుకునేదన్నారు.

వ్యక్తిగా చాలా మంచిదని, కాకపోతే ఉట్టి అమాయకురాలు అని, ఎంతో మందిని నమ్మి మోసపోయిందని, జీవితాన్ని నాశనం చేసుకుందన్నారు బాబు మోహన్‌. ఒకప్పుడు స్టార్‌ కమెడియన్‌గా రాణించిన బాబుమోహన్‌ ఇప్పుడు చాలా తక్కువగా చేస్తున్నారు. ఒకటి అర సినిమాల్లో మెరుస్తున్నారు. 

read  more: ఆస్కార్‌ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌, 200కోట్లు ఇస్తా తెప్పించండి

also read: బెడ్‌ సీన్లకి కరీనా కపూర్‌ ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? షాకింగ్‌ రీజన్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories