RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ RC16 సినిమా ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. నిర్మాతలు లాభాలను పక్కాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఓటీటీ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
RC16 : రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందిస్తున్న RC16 సినిమా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో సినిమా కంటే ముందే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ చుట్టూ ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్ రాలేనప్పటికీ, టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ డీల్ గురించి హాట్ డిస్కషన్ జరుగుతోంది.అదే సమంయలో ఓటీటీ రైట్స్ రేటు ఊహించని స్థాయికి చేరడం వెనుక ఎలాంటి గేమ్ జరుగుతోంది? నిజంగానే మార్కెట్ డిమాండ్ ఎక్కువా, లేక ఎవరో స్ట్రాటజిక్‌గా రేటును ఆకాశానికెత్తే బ్లాక్‌మెయిల్ గేమ్ ఆడుతున్నారా? అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది.
24
Ram Charan RC16 OTT Rights in Demand in telugu
బిగ్ ఓటీటీల పోటీ - రేటు పెరిగిందా, పెంచారా?
ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, RC16 కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయనేది నిజం. టాప్ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను దక్కించుకోవాలని భావించగా, ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెద్ద సంస్థలు ఈ రైట్స్ కోసం రేసులో ఉన్నాయని టాక్. దీని ప్రభావంతో రేటు ఊహించని రేంజ్‌కు చేరిందని తెలుస్తోంది. అయితే, ఇది సహజమైన పోటీనా? లేక డీలింగ్ వెనుక ప్రత్యేకమైన వ్యూహం ఏదైనా ఉందా?
రేటును ఎవరూ ఆకాశానికి ఎత్తుతున్నారు?
ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కొన్ని ఓటీటీ సంస్థలు తమ బ్రాండును హైప్ చేసుకోవడానికి తాము రేసులో ఉన్నట్లు చూపిస్తున్నాయట. ప్రక్కనున్న సంస్దలను దెబ్బ తీయటానికి మార్కెట్‌లో " ఫలానా ప్రముఖ ఓటీటీ సంస్ద RC16 కోసం భారీ బిడ్ వేసింది" అనే వార్తలు రాయించి, రూమర్స్ సృష్టించి, మిగతా సంస్థలను భయపడి దూరంగా ఉండేలా ప్రేరేపిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మేకర్స్ కూడా హైప్‌ను మరింత క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనేది నిజం.
34
Ram Charan RC16 OTT Rights in Demand in telugu
డీలింగ్ వెనుక మేకర్స్ ప్లాన్ ఏంటి?
సాధారణంగా ఓటీటీ రైట్స్ అంటే నిర్మాతలు సినిమా మొత్తం కంప్లీట్ చేసి, టాక్ బట్టి ఫైనల్ డీల్ క్లోజ్ చేస్తారు. కానీ RC16 విషయంలో అలా జరగడం లేదు. ఈ సినిమా స్టేజ్ 1 లోనే ఉండగానే ఓటీటీ రైట్స్ హైప్ ఓ రేంజ్‌లో పెంచారు. దీంతో, "మేకర్స్ ముందుగానే లాభాలను పక్కాగా లాక్ చేసుకోవాలనుకుంటున్నారా?" అనే స్ట్రాటజీ కనపడుతోంది. అదే సమయంలో, టాలీవుడ్‌లో ఓ రకమైన ట్రెండ్ మార్పు జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ముందుగా మంచి రేటు ఫిక్స్ చేసుకోవడం ద్వారా మేకర్స్ రిస్క్ తక్కువ చేసుకుంటున్నారు. కానీ, ఇదే టెక్నిక్ బూంరాంగ్ అవ్వకుండా జాగ్రత్తపడాలి.
44
Ram Charan RC16 OTT Rights in Demand in telugu
ఫైనల్ గేమ్ ఎవరిది?
ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే, RC16 ఓటీటీ రైట్స్ డీల్ ఒక బిగ్ గేమ్‌గా మారింది. ఈ హైప్‌ని క్యాష్ చేసుకోవాలనుకునే మేకర్స్, తమకే లాభమయ్యేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ సినిమాకి రికార్డు మొత్తంగా రూ. 200 కోట్లు ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం "మేము ఈ రేటుకు తీసుకుంటామా, లేక చివరికి మరొకరి చేతిలో పడిపోతుందా?" అనే తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, RC16 ఓటీటీ రైట్స్ గేమ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రియల్ డీల్ ఎంతకు క్లోజ్ అవుతుందో చూడాలి!