
కమల్ హాసన్ పై ఇప్పుడంటే రాజకీయ వివాదాలు ఉన్నాయి కానీ సినిమాల పరంగా, పర్శనల్ గానూ వివాదాలకు మాగ్జిమం దూరంగానే ఉంటూ వస్తూంటారు. అయితే ఆయన దశావతారం సమయంలో పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు.
కానీ ఆయనకు ఉన్న నిర్మాత సపోర్ట్, శ్రేయాభిలాషుల అండతో సెటిల్మెంట్ చేసుకున్నారని చెప్తారు. ఇంతకీ ఆ వివాదం ఏమిటి, అసలేం జరిగిందో చూద్దాం.
కమల్‌హాసన్ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన చిత్రం ‘దశావతారం’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌హాసన్ పది విభిన్నమైన పాత్రల్లో నటించి రికార్డు సృష్టించారు.
2008లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ‘దశావతారం’ విడుదల సమయంలో ఈ చిత్రం కాపీ అంటూ ఒకరు తమిళంలో సెంధిల్ కుమార్ అనే ఓ అసోసియోట్ డైరక్టర్ కోర్టుకు ఎక్కారు.
తను కమల్ కు కథ చెప్పానని, దశావతారం ఐడియా తనేదే అని మోసం చేసారని వాపోయారు. నిర్మాతకు నోటిసు పంపారు. అయితే కమల్ బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. కానీ అప్పట్లో ఆ అశోసియేట్ చెప్పింది మాత్రం నిజమే అని చాలా మంది సమర్దించారు.
కానీ కమల్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు కాని వ్యతిరేకత వచ్చింది. కమల్ కు హాలీవుడ్ సినిమాలు లేపేసే అలవాటు ఉంది కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేసే ఉంటాడని అనుకున్నారు. తెర వెనక ఈ వివాదం పెద్దదైంది. ఓ టైమ్ లో ఆ అశోశియేట్ మీడియా ముందుకు వస్తానన్నుడు. అప్పుడు నిర్మాత పిలిచి కమల్ తరుపున సెటిల్మెంట్ చేసారని వినికిడి.
ఇంతకీ సెందిల్ కుమార్ అప్పట్లో ఏమన్నారంటే.... “నేను కమల్ గారికి వీరాభిమానిని, నేను చాలా కథలు చాలామందికి చెప్పాను. అలా చెప్పిన వాటిలో ఈ 'దశావతారం' కధ ఒకటి. తొలినుంచీ ద్విపాత్రాభినయాలు, త్రిపాత్రాభినయాలు.. అంతెందుకు నవ పాత్రలూ చేశారు. కానీ పది పాత్రలు చేసే కథనోదాన్ని నేను రాశాను.
కథ క్లైమాక్స్ లో లో హీరో వెరైటీ గెటప్లో కని పిస్తాడని ఓ సారి మా డైరెక్టర్ గారితోనే చెప్పాను. అప్పుడాయన, ఈ చిత్రంలో చేసేందుకు కమల్ తప్ప మరెవ్వరూలేరు అన్నారు. అసలే కమల్ అభిమా నిని కనుక, నాకాయన ఐడియా వచ్చింది. అర్ధనారి లేదా క్లోన్స్ అనే టైటిల్స్ | బావుంటాయని కూడా సూచించాను. వాటి డిజైన్లను కూడా కమల్ హాసన్ గారి ఆఫీసుకు పంపాను.
ఈ కథను తీసుకుని కనుక కమల్ నటిస్తే, ఆయనకు తప్పకుండా ఆస్కార్ అవార్డు వచ్చే తీరుతుందనీ, వారు కోరితే వెళ్ళి కథ చెబుతానని కూడా తెలియజేశాను. రమ్మని ఉత్తరం వచ్చింది. వెళ్ళాను. స్క్రిప్ట్ను ఆఫీసులోని మురళి అనే వ్యక్తి తీసుకున్నారు.
నా మిత్రుడితో వెళ్ళినా, అతన్ని బయటే వుండమని, నన్ను మాత్రమే లోపలికి అనుమతిం చారు. అదికనుక కమల్ గారు ఓకే చేస్తే, ఈ చిత్రానికి నేనే సహాయ దర్శ కుణ్ణనీ, దీనికి చెల్లించవలసిన డబ్బుకూడా ఇస్తారని ఒప్పందం కూడా జరిగింది. చాలా ఆనందించాను.
హఠాత్తుగా కమల్ పదివేషాల్లో కనిపించబోతున్న చిత్రం తయారవుతున్నదన్న వార్త విని, వెంటనే వెళ్ళి అడిగితే, మురళి- అనుకున్న ప్రకారమే అంతా జరుగుతుందనీ, టచ్ వుండమనీ హామీ ఇచ్చారు.
కానీ ఆ తరువాత కొంత కాలానికే ఆ చిత్రం షూటింగ్ ప్రారంభమైపోయిందని విని, దిగ్భ్రాంతి చెందాను. వెళ్ళి మళ్ళీ ఆరాతీస్తే మురళి, అది నా కథ కాదనేశారు. నన్ను బయటికి గెంటించేందుకు సెక్యూరిటీని కూడా పిలిచారు. ఇక నాకక్కడ న్యాయం జరగదని, ఆ చిత్ర నిర్మాత రవిచంద్రన్ గారికి నోటీస్ పంపించాను.
కథ కమల్ గారిదేనని ఆయనన్నారు. ఆ తరువాత ఎన్నో చోట్లకు తిరిగినా ఫలితం దక్కనేలేదు. అందరూ పోనీయవయ్యా అని సలహా ఇచ్చి నవారేకానీ, నాకు న్యాయం జరిపించేందుకు ముందుకు వచ్చిన వారే లేకుండా పోయారు.
ఇప్పుడీ కోర్టు ఉత్తర్వులే ఆధారం. నాకు వచ్చిన తొలి ఫోన్ లు నుంచి అన్నిటినీ నోట్ చేసి పెట్టుకున్నాను. అవే నాకు సాక్ష్యాలు' అన్నాడు సెందిల్. అయితే ఇవన్నీ చూసే సెంధిల్ తో సెటిల్మెంట్ చేసుకున్నారని తమిళ వర్గాల సమాచారం. ఏదైమైనా కమల్ చేసింది తప్పే ఈ విషయంలో అంటుంది తమిళ పరిశ్రమ ఇప్పటికి.