9 కోట్లకు పైగా ఫాలోవర్స్, మోదీని దాటిన ఇమేజ్, ప్రభాస్ తో ప్లాప్ సినిమా చేసిన హీరోయిన్ ఎవరు?

Published : Sep 25, 2025, 11:20 AM IST

ఇండియాన్ ఫిల్మ్ సెలబ్రిటీలలో 9 కోట్లకు పైగా ఫాలోవర్స్ తో టాప్ లో ఉన్నది   ఉన్న స్టార్ ఎవరో తెలుసా? లాస్ట్ ఇయర్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా మించిన హీరోయిన్ ఎవరు.? ప్రస్తుతం టాప్ లో ఉన్నది ఎవరో తెలుసా? 

PREV
17
స్టార్స్ , ఫ్యాన్స్ మధ్య వారధి

ప్రస్తుతం సినిమా తారల ఇమేజ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ ను బట్టి లెక్కలు వేస్తున్నారు. సినిమాలు హిట్ అయినా కాకపోయినా సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఏంటే స్టార్ గా వెలుగు వెలగవచ్చు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాలో ఎంత ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటే, అంత ఎక్కువ ఇమేజ్ వారి సొంతం. హీరో అయినా హీరోయిన్ అయినా నెట్టింట ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది ముఖ్యమైపోయింది. గతంలో స్టార్స్ కు ప్యాన్స్ కు మధ్య సినిమా మాత్రమే ఉండేది. కాని ప్రస్తుతం సోషల్ మీడియా వారిద్దరి మధ్య వారధిగా మారింది. ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లు, ఇంటర్వ్యూలు, సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలతో సామాన్యులకు మరింత దగ్గరయ్యారు సెలబ్రిటీలు. ఈక్రమంలో వారి ఫాలోయింగ్ విషయంలో కూడా పోటీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న ఇండియన్ స్టార్స్ లో ఎక్కువ మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్న సినిమాసెలబ్రిటీ ఎవరో తెలుసా?

27
ఇన్ స్టాలో పోటీ పడుతోన్న హీరోయిన్లు

ప్రస్తుతం సోషల్ మీడియానే స్టార్ సెలబ్రిటీల స్టార్ డమ్ ను కొలిచే కొలమానంగా మారింది. ఎంత ఎక్కువ ఆదరణ ఉంది అనేది సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం. హాట్ హాట్ ఫోటోలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం తో వారిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోతోంది. సినిమాలతో పాటు ఇన్ స్టా స్టార్ సెలబ్రిటీల ఇన్ కమ్ సోర్స్ గా మారిపోయింది. దాంతో ఫాలోవర్స్ ను పెంచుకునే విషయంలో సెలబ్రిటీ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు. తమ ఫ్యాన్స్ ను, కామన్ నెటిజన్లను ఆకర్శించే విధంగా రకరకాల పోటోషూట్లతో, డిఫరెంట్ కంటెంట్ తో ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు.

37
అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో హీరోయిన్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటూ వస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా శ్రద్దా కపూర్ రికార్డు క్రియేట్ చేసింద. ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నటిగా ఆమె ఇప్పుడు టాప్ లో నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ను 9.36 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు. ఇది ఆమెను భారతదేశంలో రెండవ అత్యధిక ఫాలోవర్లను కలిగిన వ్యక్తిగా నిలిపింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీను కూడా శ్రద్ధా అధిగమించడం విశేషం. మోదీ ఫాలోవర్లు సంఖ్య 93.9 మిలియన్లుగా ఉంది. అంటే దాదాపు 9 కోట్ల 30 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను శ్రద్దా కపూర్ కలిగి ఉంది.

47
మోదీని దాటిన ఇమేజ్

లాస్ట్ ఇయర్ శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ని కూడా క్రాస్ చేసింది శ్రద్దా కపూర్. గత ఏడాది మాత్రమే మోదీని శ్రద్దా కపూర్ క్రాస్ చేసింది. కానీ ప్రస్తుతం మోదీ 9 కోట్ల 70 లక్షలకు పైగా ఇన్ స్టా ఫాలోవర్స్ తో రెండ ప్లేస్ లో నిలిచారు. శ్రద్దా కపూర్ మాత్రం 9 కోట్ల 30 లక్షలతో మూడో స్థానంలో నిలిచింది. ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ సాహోలో హీరోయిన్ గా నటించింది శ్రద్దా కపూర్. ఈసినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక ఇన్ స్టా ఫాలోవర్స్ లో ఫస్ట్ ప్లేస్ ను చాలా కాలంగా విరాట్ కోహ్లీ ఆక్రమించి ఉన్నాడు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ను ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారు.

57
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ లో టాప్ ఎవరు

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ పరంగా దేశంలో మొదటి స్థానాన్ని టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆక్రమించి ఉన్నాడు. అతనికి 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ తర్వాత ఇప్పుడు మోదీ రెండవ స్థానంలో ఉండగా, శ్రద్ధా మూడవ స్థానంలోకి చేరారు. ఇక ఆతరువాతి స్థానంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఉన్నారు. ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 92 మిలియన్స్ అంటే దాదాపుగా 9 కోట్ల 20 లక్షలమంది. ఇక ఆతరువాత స్థానంలో ఆలియా భట్ ఉన్నారు. అలియా భట్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 86 కోట్ల 50 కోట్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. దీపికా పదుకొణె 8 కోట్ల 20 లక్షలతో నాలుగో స్థానంలో ఉండగా, 8 కోట్ల 10 లక్షలతో కత్రినా కైఫ్ ఐదో స్థానంలో నిలిచారు.

67
టాప్ 10 లేని హీరోలు

మొత్తంగా టాప్ 10 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఎక్కువ మంది సినీ రంగానికి చెందిన నటీమణులే చోటు దక్కించుకున్నారు. గమనించదగ్గ విషయం ఏంటంటే, టాప్ 10లో ఏ హీరోకి స్థానం దక్కలేదు. ఈ లెక్కల ప్రకారం, శ్రద్ధా కపూర్ భారతదేశపు అత్యంత పాపులర్ సినీ నటీమణిగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు విపరీతమైన ఆదరణ లభించడంతో ఆమె క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

77
టాలీవుడ్ లో టాప్ ఎవరంటే?

టాలీవుడ్ హీరోయిన్ల విషయం తీసుకుంటే ఇన్ స్టా ఫాలోయింగ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచింది. ఇన్ స్టా గ్రామ్ లో రష్మిక 4 కోట్ల 70 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇక ఆతరువాతి స్థానంలో సమంత ఉన్నారు. సమంత ఇన్ స్టా ఫాలోవర్స్ 3 కోట్ల 70 లక్షలు, ఇక నాలుగో ప్లేస్ లో తమన్నా భాటియా నిలిచారు. తమన్నా 2 కోట్ల 80 లక్షల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇక మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 2 కోట్ల 70 లక్షల ఫాలోవర్స్ తో నిలవగా, మరో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2 కోట్ల 60 లక్షలతో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాలీవుడ్ లో హీరోయిన్లు ఇన్ స్టా ఫాలోయింగ్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లను అందుకోలేకపోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories