
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగు వెలిగిన హీరోలు సినిమాల నుంచి వచ్చిన సంపాదన మాత్రమే కాకుండా, రకరకాల బిజినెస్ లు కూడా చేసి కోట్లకుపడగలెత్తి ఉన్నారు. నటులుగా వారు సంపాదించిన డబ్బును వివిద వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి, వేల కోట్లకు అధిపతులు అయిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నాగార్జున, అంతకు ముందు ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరావు, మరో వైపు మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్ లాంటి నటులు ఇటు ఇండస్ట్రీలో అటు వ్యాపారాల్లో రాణించి కోట్లు సంపాదించారు. అయితే వీరందరికంటే ముందు ఓ స్టార్ హీరో తన సంపాదనతో భూములు కొని 5000 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో
ఆ హీరో ఎవరో కాదు తెలుగు పరిశ్రమ అందాల నటుడు శోభన్ బాబు. హీరోగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు. ఆ కాలంలోనే శోభన్ బాబుకు లేడీ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎక్కువ. శోభన్ బాబు రింగ్ హెయిర్ స్టైల్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ. అటువంటి నటుడు 60 ఏళ్లు దాటగానే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తనను అందాల నటుడిగా, సోగ్గాడుగా చూసిన జనాలు, ముసలి పాత్రల్లో చూడలేరని, అందుకే ఇకపై నటించనని ప్రకటించాడు. కోట్లు ఆఫర్ చేసినా, తెరపైకి రావడానికి ఆయన ఇష్టపడలేదు. అంతే కాదు తన ఫోటో కూడా బయట కనిపించకుండా జాగ్రత్త పడ్డారు శోభన్ బాబు.
ఇక శోభన్ బాబు హీరోగా ప్రయత్నం చేసే సమయంలో చాలా పేదరికంలో ఉండేవారు. భార్య ఇద్దరు పిల్లలతో ఒక రూమ్ లో అద్దెకు ఉంటూ, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకే ఆయనకు డబ్బు విలువ తెలుసు. క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపారు శోభన్ బాబు. డబ్బును వృధా చేయకుండా సినిమాల్లో సంపాదించినదంతా ఆయన భూమిపై పెట్టారు. భూమి అడవిలో ఉన్నా సరే ఏదో ఒక టైమ్ కు దానికి విలువ వస్తుంది అని నమ్మిన వ్యక్తి. ఆ నమ్మకమే చెన్నైలో ఎన్నో భూములు ఆయన కొన్నారు. ఇప్పుడు అవి వందలు, వేల కోట్ల విలువ కలిగి ఉన్నాయి. శోభన్ బాబు అలా తన సంపాదన రియల్ ఎస్టేట్ లో పెట్టడంతోనే వేల కోట్లకు అధిపతి అయ్యారు. ప్రస్తుతం చెన్నైలో సగం భూములు ఆనయవేనట.
శోభన్ బాబు రియల్ ఎస్టేట్, వ్యాపారాలతో వేల కోట్లు సంపాదించాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు 5 వేల కోట్లుకు పైనే ఉంటుందని ఏపీ డిప్యూటీ స్పీకర్, శోభన్ బాబు సన్నిహితుడు రఘురామకృష్ణం రాజు ఓ సందర్భంలో వెల్లడించారు. ఆయనకు భూమిపై ఇన్వెస్ట్ చేయమని తన తండ్రి సలహా ఇచ్చారని రఘురామ వెల్లడించారు. ఇక శోభన్ బాబు తానుఎదగడంతో పాటు చాలామందికి ఇలా సలహాలు ఇచ్చి ఎదిగేలా చేశారు. ఎంతో మంది ఆయన మాట విని భూములు కొని కోట్లు సంపాదించిన వారు ఉన్నారు.
శోభన్ బాబు తాను పాటించిన ఆర్ధిక సూత్రాన్ని అందరితో పంచుకునేవారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, సహనటులు అందరికి తమ డబ్బును భూమిపై పెట్టమనిసలహా ఇచ్చేవారు. అలా ఆయన సలహా పాటించి మంచి స్థాయికి వెళ్లిన వారిలో మరళీ మోహన్ ఒకరు. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో స్టార్ నటుడిగా కొనసాగారు. అయితే ఒక వైపునటిస్తూనే.. ఆ డబ్బుతో జయభేరి సంస్థను స్థాపించారు. నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. అలా హైదరాబాద్ లో జయభేరి సంస్థ ద్వారా కోట్ల ఆస్తిని మురళీ మోహన్ సంపాదించారు.
శోభన్ బాబు సలహా విని మురళీ మోహన్ తో పాటు చంద్రమోహన్ లాంటి ఎంతో మంది నటులు కోట్లు సంపాధించారు. కాని శోభన్ బాబు సలహా వినకుండా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. తాను ముందు కళ్లు తెరవలేకపోయానని, శోభన్ బాబు చెప్పినట్టు విని ఉంటే బాగుండేదని అలనాటి హీరోయిన్ ఊర్వశి శారద ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తాను వ్యాపారం ద్వారా చాలా నష్టపోయానని.. చాలా ఆస్తులు పోగోట్టుకున్నాని అన్నారు. శోభన్ బాబు సలహాతో చాలామంది బాగుపడ్డారు, కాని నేను వ్యాపారం చేసి నష్టపోయాను అన్నారు. జయసుధ కూడా ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి మాట్లాడుతూ.. ఈ విషయాలే ప్రస్తావించారు. ఆయన చాలా క్లోజ్ గా ఉండేవారు. సంపాదనను భూమిపై పెట్టుబడిపెట్టమని చెప్పేవారు. ఆమాటతోనే నేనుచెన్నైలో భూమి కొన్నాను.కాని బోరుపడలేదని అమ్మేశాను. కాని ఇప్పుడు ఆ భూమి వదల కోట్ల విలువ చేస్తోంది. రజినీకాంత్ ఫామ్ హౌస్ కూడా పక్కనే ఉంది అని జయసుధ అన్నారు.