Allu Arjun Pushpa 3 Release : పుష్ప3 ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారా? వస్తుందిలే ఇప్పుడో అప్పుడో అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అయితే మీకు నిరాశ తప్పదు. కాస్త పుష్ప మ్యానియా నుంచి బయటకు రండి. ఎందుకంటే పుష్ప3 ఇప్పట్లో లేనట్టే అని తేల్చేశారు ఆసినిమా నిర్మాతలు.
ఉంటుంది కాని ఇప్పట్లో కాదు అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. నిర్మాత రవిశంకర్ రివిల్ చేసిన అప్ డేట్ ప్రకారం పుష్ప3 సినిమా కోసం ఇంకో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి ఈలోపు అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనేది కూడా రవిశంకర్ క్లారిటీఇచ్చేశాడు.
Also Read : పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా.. టాలీవుడ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప2. పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ తో పుష్ప2ను అంతకుమించి తెరకెక్కించారు. ఇక అందుకు తగ్గట్టే పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
హిట్ అంటే అంతా ఇంతా హిట్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేంతలా రెస్పాన్స్ ను సాధించింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది పుష్ప2. ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చైనా రిలీజ్ కాకుండానే ఇండియాలోనే ఈ రికార్డ్ ను సాధించింది పుష్ప 2 .
Also Read :నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?
అయితే అనుకోకుండా ఈసినిమాకు మరో సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో ప్రకటించారు మూవీ టీమ్. ఈ సినిమాకు పుష్ప 3 ది ర్యాంపేజ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. దాంతో వెంటనే పుష్ప3 షూటింగ్ మొదలెట్టేసి.. వెంట వెంటనే షూటింగ్ చేసేసి.. వచ్చే ఏడాదో.. ఆ వచ్చే ఏడాదో రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కాని వారికి నిరాశ తప్పలేదు. అల్లు అర్జున్ రెండు వేరే సినిమాలు చేసిన తరువాతే పుష్ప3 మూడ్ లోకి వస్తారట.
Also Read :పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్
ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత రవి శంకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పుష్ప3 ని 2028లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు నిర్మాత. అది కూడా పక్కాగా కాదు ప్రయత్నిస్తాము అన్నారు. ఇంకో మూడేళ్ళ తరువాతే ఈ సినిమా స్టార్ట్ అయ్యి 2028కే రావచ్చని చెప్పవచ్చు. మరి ఈలోపు అల్లు అర్జున్ ఏం చేస్తాడని ప్యాన్స్ కు అనుమానం రావచ్చు. ఈ విషయంలో కూడా రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read :ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
Pushpa 3
అల్లుఅర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా చేయబోతున్నాడని ఆయన అన్నారు. ఈసినిమా కంప్లీట్ అయిన తరువాతనో లేక ఈ సినిమా చేస్తూనేనో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో జాయిన అవుతార. ఈరెండు సినిమాలు కంప్లీట్ అయ్యే సరికి రెండేళ్లు పైనే పట్టే అవకాశం ఉంది. ఆతరువాతే పుష్ప3ని స్టార్ట్ చేస్తామన్నారు నిర్మాత. అంతే కాదు 2028 వరకూ పుష్ప3ని రిలీజ్ చేసేలా గట్టిగా ప్రయత్నం చేస్తామన్నారు. దాంతో పుష్ప మ్యానియాలో ఉన్న ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.
Also Read : 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు
అయితే పుష్ప2 వల్ల చెలరేగిన వివాదంతో బన్నీ బాగా డిస్ట్రబ్ అయ్యారు. జైలుకు వెళ్ళిరావడం, తనపేరును కాంట్రవర్సీ చేయడంతో ఆయన చాలా బాధపడ్డారు. దాంతో పుష్ప3కి కాస్త గ్యాప్ ఇస్తేనే మంచిది అనుకుంటున్నారట అల్లు అర్జున్. అందుకే వెంటనే తన లుక్ ను ఛేంజ్ చేశారు. పుష్ప వేవ్ నుంచి బయటకు వచ్చారు.
కాని అందరు త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు అనుకున్నారు. కాని రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం బన్నీ ముందు అట్లీ సినిమాను స్టార్ట్ చేయబ్తున్నట్టు తెలుస్తోంది. ఇక అట్లీ సినిమాకు సబంధించిన వరుసగా వస్తున్న వార్తలు అందరికి తెలిసిందే. ఈసినిమాలో శివకార్తికేయన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read : 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార - విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?