శోభన్ బాబు సినిమా ఫంక్షన్స్ ను ఎందుకు దూరం పెట్టారు, అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.
Shobhan Babu Avoided Movie Functions: నట భూషణ్ శోభన్ బాబు సినిమా ఈ వెంట్లను ఎందుకు దూరం పెట్టారు. చివరి వరకూ ఆయన ఏ ఈవెంట్ కు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?
Shobhan Babu Avoided Movie Functions: నట భూషణ్ శోభన్ బాబు సినిమా ఈ వెంట్లను ఎందుకు దూరం పెట్టారు. చివరి వరకూ ఆయన ఏ ఈవెంట్ కు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?
Shobhan Babu Avoided Movie Functions: శోభన్ బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గావెలుగు వెలిగారు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపారు. అందరికంటే భిన్నగా బ్రతికిన ఆయన కొన్ని విషయాలలో తన మార్క్ చూపించారు. డబ్బు విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే శోభన్ బాబు.. ఆ విషయంలో విమర్శలు కూడా ఫేస్ చేశారు. ఇక తన ఫ్యామిలీలో ఎవరిని సినిమాల వైపు చూడకుండా జాగ్రత్తపడ్డారు స్టార్ హీరో. ఇక ఆయన కూడా సినిమాలు చేయడం వరకే కాని సినిమా ఈవెంట్స్ కు ఎప్పుడు వచ్చేవారు కాదట దానికి కారణం ఏంటో తెలుసా?
Also read: సాయి పల్లవి ఎనర్జీ సీక్రెట్ ఇదే ? రోజుకు 2 లీటర్లు ఏం తాగుతుందో తెలుసా?
తెలుగు సీనిమా పరిశ్రమలో అందాల నటుడిగా పేరుంది శోభన్ బాబుకి. అందాల నటుడు మాత్రమే కాదు, సోగ్గాడు, నట భూషణుడు కూడా ఆయనే. లేడీ ఫ్యాన్స్ మాత్రమే కాదు స్టార్ హీరోయిన్లు కూడా శోభన్ బాబు కోసం పోటీ పడేవారు. ఆయనతో సినిమా అంటే ఎంతో ఉత్సాహం చూసించేవారు.
ఇండస్ట్రీలో హీరోగా ఆయనకంటూ ఒక స్టైల్ నుక్రియేట్ చేశారు శోభన్ బాబు. రింగ్ ల జుట్టుతో స్టైలీష్ ఐకాన్ గా ఉన్నారు శోభన్ బాబు. నటుడిగా తెలుగువారి మనసులలో చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ చాలామందికి శోభన్ బాబ రింగ్ అంటే మోజు అలానే ఉంది.
Also read: ప్రభాస్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ వార్, ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు, ఎవరు గెలిచారో తెలుసా?
ఆయన్ను చూస్తే చాలు అనుకునే మహిళా అభిమానులను లక్షల్లో ఉండేవారు. అప్పటి జనరేషన్ కి సంబంధించిన వాళ్లు ఆయనను ఇప్పటికీ తలుచుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక శోభన్ బాబు గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు. ఆయన అలవాట్లు, పద్దతులు వేరు. మరీ ముఖ్యంగా శోభన్ బాబు సినిమా ఈవెంట్లకు ఆయన వెళ్ళడం చాలా తక్కువ. తప్పదు అనుకుంటే తప్ప వెళ్ళేవారు కాదు. అది కూడా తన అవసరం పక్కాగా ఉంది అనుకుంటేనే వెళ్ళేవారట. ఇంతకీ ఈవెంట్లకు ఆయన వెళ్లకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Also read: జనతా గ్యారేజ్ తో పాటు మోహన్‌లాల్ టాప్ 10 మూవీస్, లిస్టులోకి L2: Empuraan
ఇక సినిమాలను దూరం అయిన తరువాత, ఫంక్షన్లకు వెళ్లడమనేది పూర్తిగా తగ్గించేశారు శోభన్ బాబు. ఇండస్ట్రీలో అన్నేళ్ళు హీరోగా ఉన్న శోభన్ బాబు.. ఆతరువాత పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లకు పిలిచినా ఎందుకు వెళ్ళలేదో తెలుసా? ఈ ప్రశ్న శోభన్ బాబకు ఎదురవ్వగా.. తనదైన స్టైల్ ఆయన ఆన్సర్ ఇచ్చారు. చాలామంది సినిమా ఫంక్షన్లకు పిలుస్తూనే ఉంటారు. కాని అక్కడికి వెళితే వాళ్ళకు నాద్వారా ఏదో ఒక ఫలితం ఉండాలి కదా? అది ఉండాలంటే నేను ఆ సినిమాను, ఆ నటులను పొగడాల్సి ఉంటుంది.
Also read: Sikandar Twitter Review: సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?
పిలిచారు గనుక ఆ సినిమాను, ఆ నటులను నేను పొగడవలసి ఉంటుంది. ఆ పొగడ్తలలో ఏ మాత్రం కాస్త అటు ఇటైనా వాళ్ల అభిమానులు ఊరుకోరు. లేదంటే ఫలానా సినిమా ఫంక్షన్లో ఫలానా వారి గురించి చెప్పినట్టుగా ఈ ఫంక్షన్లో చెప్పలేదంటారు. నా పని నేను చేసుకోకుండా మొహమాటానికిపోయి కొత్త తలనొప్పులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. పరిస్థితులలో వస్తున్న మార్పులను గమనించే నేను ఫంక్షన్లకు వెళ్లడం మానేశాను" అని ఆయన అన్నట్టు తెలుస్తోంది.
సినిమా ఫంక్షన్స్ కు వెళ్తే ఏదో ఒకటి మాట్లాడటం, లేదా పొగడం చూస్తూనే ఉన్నాం. కాని అలాంటి ఇబ్బందులు లేకుండా శోభన్ బాబు చేసిన పని బాగుంది అంటున్నారు సినిమా జనాలు. ఇఫ్పుడు గెస్ట్ లు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. ఇక శోభన్ బాబు సినిమాలు మానేసిన తరువాత ఇండస్ట్రీ వైపు తిరిగి కూడాచూడలేదు. రనీసం తన ఫోటో కూడా పేపర్లో రాకుండా చూసుకున్నారు నట భూషణుడు.