‘డీజే టిల్లు’: మొదట టైటిల్ వేరే, త్రివిక్రమ్ కు నచ్చక మార్చాం
సూపర్ హిట్ చిత్రం ‘డీజే టిల్లు’ మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్‌తో ప్రారంభమైంది. స్నేహితులు, త్రివిక్రమ్ సలహా మేరకు టైటిల్ మార్చారు.
సూపర్ హిట్ చిత్రం ‘డీజే టిల్లు’ మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్‌తో ప్రారంభమైంది. స్నేహితులు, త్రివిక్రమ్ సలహా మేరకు టైటిల్ మార్చారు.
సాధారణంగా సినిమాకు కథ రాసుకునేటప్పుడు ఒక టైటిల్ అనుకుంటారు. కానీ కాలక్రమేణా అంతకన్నా మంచి టైటిల్ దొరికినప్పుడు దాన్ని ప్రక్కన పెట్టేసి వేరే టైటిల్ ఫిక్స్ చేసుకుంటారు. అలా సూపర్ హిట్ ‘డీజే టిల్లు’ మొదట వేరే టైటిల్ అనుకున్నారట.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ స్టార్ హీరోల సినిమాలే కాకుండా కంటెంట్ ప్రధానమైన సినిమాలను రూపొందిస్తూ విజయాలను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ‘డీజే టిల్లు’.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లోని డైలాగ్స్ పెద్ద కాంట్రవర్సీకి దారి తీశాయి.
డీజే టిల్లు చిత్రంలో అడల్ట్ కంటెంట్ ఉంది. అయినా సరదాగా సాగే రొమాంటిక్ కామెడీలా తెరకెక్కించిన డీజే టిల్లు ప్రేక్షకులకు బాగా కిక్ ఇచ్చి హిట్ ఇచ్చింది. ఈ చిత్రానికి మొదట వేరే టైటిల్ అనుకున్నారట ఆ విషయం స్వయంగా రివీల్ చేసారు సిద్దు జొన్నలగడ్డ.
సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘డీజే టిల్లు’ చిత్రానికి తొలుత మేము ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ అనుకున్నాం. ఆ టైటిల్‌ను మాకంటే ముందు వేరే వాళ్లు రిజిస్టర్ చేయించుకుంటే.. వాళ్లకు సుమారు రూ.4 లక్షలు ఇచ్చి మరీ కొనుగోలు చేశాం.
తీరా, స్నేహితులతో మా కథ డిస్కస్ చేస్తున్నప్పుడు టైటిల్ చెప్పగానే ఇదొక సాధారణ చిత్రమే అనుకొని ఎవరూ వినేవారు కాదు. ఓసారి త్రివిక్రమ్ సర్.. మా టైటిల్ విని.. ఇదొక మధ్యతరగతి వ్యక్తి కథ అనుకున్నారు.
దాంతో మేము, టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాం. కథలోని హీరో పాత్ర పేరు (డీజే టిల్లు)నే టైటిల్‌గా పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నాం’’ అని వివరించారు.