‘హత్య’ సినిమాపై మరో షాకింగ్ వివాదం, నిర్మాతలు వాళ్లా?
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' సినిమా నిర్మాతపై కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని పలువురు ప్రముఖులు ఫిర్యాదు చేస్తున్నారు.
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' సినిమా నిర్మాతపై కేసు నమోదు చేశారు. ఈ సినిమాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచారని పలువురు ప్రముఖులు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హత్య సినిమా ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాలో తమ వ్యక్తిత్వాన్ని కించపరిచారంటూ పలువురు ప్రముఖులు పోలిస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమా సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘హత్య’ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలపై కేసులు కూడా నమోదయ్యాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉండటమే అందుకు కారణం.
ఈ నేపధ్యంలో ‘హత్య’ సినిమాపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీకెందుకంత ఉలికిపాటు అని పులివెందుల వైకాపా నేతలను మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్‌యాదవ్ ప్రశ్నించారు.
ఆ సినిమాలో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, వైకాపా నేత శివశంకర్‌రెడ్డి, ఉదయ్ పాత్రలను ఎందుకు చూపించలేదని నిలదీశారు.
వైకాపా నేతలే ఆ సినిమా తీశారని, ఆ పార్టీ వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో సునీల్‌యాదవ్ శనివారం విలేకరులతో మాట్లాడారు.
వివేకా హత్య కేసులో తనపై వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసని, హంతకులు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.