“తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం” అని కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన శివజ్యోతి

Published : Nov 23, 2025, 03:57 PM IST

Shiva Jyothi: ప్రముఖ టీవీ నటి శివజ్యోతి తిరుపతి లడ్డుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపింది. తమ మాటలు అపార్థం చేసుకున్నారని, తమ ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని స్పష్టం చేసింది.  

PREV
15
తిరుమల లడ్డు ప్రసాదంపై వ్యాఖ్యలు..

ప్రముఖ టీవీ నటి శివజ్యోతి తిరుమల లడ్డు ప్రసాదంపై తాను, తన సోదరుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టతనిస్తూ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసింది. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని శివజ్యోతి కోరింది. తనకు తిరుమల వెంకటేశ్వరుడిపై అపారమైన భక్తి, అభిమానం ఉందని పేర్కొంది. 

25
కాంట్రవర్సీ కామెంట్స్..

ఈ వివాదంపై తన వైపు నుంచే పొరపాటు జరిగిందని, తన మాటలు జనాల్లోకి తప్పుగా వెళ్లాయని శివజ్యోతి అంగీకరించింది. తిరుమల దర్శనం తర్వాత ప్రసాదం తీసుకునేటప్పుడు క్యూ లైన్‌లో నిలబడి “తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం”, ‘కాస్ట్‌లీ ప్రసాదం అడుక్కోవడం’ లాంటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

35
తను, తన సోదరుడి తరపున క్షమాపణలు

తన వ్యాఖ్యల గురించి తాను ఇప్పుడు ఎలాంటి వివరణ ఇచ్చినా అది అబద్ధంగానే అనిపిస్తుందని భావించి, కేవలం తప్పును ఒప్పుకుంటున్నానని పేర్కొంది. తన సోదరుడు సోను తరపున కూడా క్షమాపణలు చెప్పింది శివజ్యోతి. తన బిడ్డను వెంకటేశ్వరుడి దయ వల్లే పొందినట్టు పేర్కొంది. 

45
దేవుడి గురించి తప్పుగా ఎలా మాట్లాడతా.?

అలాంటి దేవుడి గురించి తాను తప్పుగా ఎలా మాట్లాడతానని చెప్పింది. తనకు అన్ని మతాల దేవుళ్ల పట్ల భక్తి ఉందని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి తన జీవితాన్ని మార్చారని ఆమె చెప్పింది. ఈరోజు తాను అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన దయేనని స్పష్టం చేసింది. తెలిసిగానీ, తెలియకగానీ తన నోటి నుంచి, తన సోదరుడి నోటి నుంచి తప్పుడు మాటలు వచ్చాయని, దానికి కచ్చితంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది.

55
ఎవరి ఒత్తిడితోనూ చెప్పట్లేదు..

యూట్యూబ్ ఛానెల్‌లు లేదా ఇతర సంస్థల ఒత్తిడితో కాకుండా, తనకే తప్పుగా అనిపించడం వల్లే ఈ క్షమాపణ చెబుతున్నానని శివజ్యోతి క్లారిటీ ఇచ్చింది. టీటీడీ సభ్యులకు, తన మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ మరోసారి క్షమాపణలు చెబుతున్నా.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని కోరింది. 

Read more Photos on
click me!

Recommended Stories