క్లాప్ కొట్టిన మెగాస్టార్.. ప్రభాస్ కనిపించకుండానే స్పిరిట్ మూవీ ఓపెనింగ్, సందీప్ రెడ్డి ప్లానింగ్ ఏంటి?

Published : Nov 23, 2025, 02:14 PM IST

Spirit Muhurtam అభిమానులు  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పిరిట్ మూవీ  ఓపెనింగ్ ప్రభాస్ కనిపించకుండానే  జరిగిపోయింది. మెగాస్టార్ క్లాప్ తో మొదలైన ఈవెంట్ లో ప్రభాస్ ఎందుకు కనిపించలేదు. సందీప్ రెడ్డి వంగా  ఏం ప్లాన్ చేశాడు. 

PREV
14
పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్

ఇండియా అంతట సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘స్పిరిట్. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఓపెనింగ్ మాత్రం జరగలేదు. ఇక తాజాగా అధికారికంగా ఈసినిమా షూటింగ్ ప్రారంభించారు.  ఈ భారీ ప్రాజెక్ట్‌ ఓపెనింగ్ లో ప్రభాస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అసలు ఆయన కనిపించకుండా  ముహూర్త శుభకార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటి.  అయితే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు స్వయంగా చిరంజీవి క్లాప్ ఇచ్చి సినిమా ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ప్రభాస్ లుక్ ను రివిల్ చేయకుండా.. స్పెషల్ గా రిలీజ్ చేసి… అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడట దర్శకుడు.

24
ప్రభాస్ కోసం కొరియన్ విలన్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్, పాన్-ఇండియా స్థాయిని దాటి పాన్-వరల్డ్ రేంజ్‌లో ఈసినిమా రూపొందుతోందని మూవీ టీమ్ నుంచి సమాచారం. వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్, ప్రభాస్‌తో కలిసి భారీ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ చిత్రం భారీ స్థాయి విజువల్ ట్రీట్‌గా రూపుదిద్దుకుంటోంది. కథ, నిర్మాణ విలువలు, యాక్షన్ ఎపిసోడ్లు అన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందబోతున్నాయని తెలుస్తోంది. అందుకోసం సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా కొరియన్ స్టార్ ను కూడా రంగంలోకి దింపబోతున్నారు.

34
హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ..

భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్ సంయుక్తంగా టీ-సిరీస్ ఫిల్మ్స్ తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ మూవీ అనిమల్ సినిమాతో త్రిప్తికి మంచి పేరు వచ్చింది. ఈక్రమంలోనే ప్రభాస్‌తో కొత్త జోడీగా ప్రేక్షకుల ముందుకు ఆమె రానుంది. వీరితో పాటు ఈసినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, వెటరన్ నటి కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

44
తొమ్మిది భాషల్లో రిలీజ్ కాబోతోన్న సినిమా..

రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన ప్రత్యేక “సౌండ్-స్టోరి” ఆడియో టీజర్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఏ విధమైన విజువల్స్ లేకుండా కేవలం శబ్దాల రూపంలో విడుదలైన ఈ టీజర్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.స్పిరిట్ మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల కానుంది. ఈ రేంజ్‌లో విడుదల కావబోతోన్న ఫస్ట్ మూవీగా స్పిరిట్ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. అంతే కాదు స్పిరిట్ తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేయబోతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి.

Read more Photos on
click me!

Recommended Stories