ఐబొమ్మ మళ్లీ వచ్చిందిరోయ్.! SBI పోర్టల్‌లో అసలు ఎలా పెట్టావ్‌రా

Published : Nov 23, 2025, 01:49 PM IST

సైబర్ నేరగాళ్లు నకిలీ పోర్టల్స్‌తో రెచ్చిపోతున్నారు. తాజాగా ఎస్‌బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో వచ్చిన వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. iBomma, బప్పం వంటి పేర్లతో కొత్త నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి. ఆ వివరాలు ఇలా.. 

PREV
15
ఐబొమ్మ పోతే.. మరొకటి..!

సైబర్ నేరగాళ్లు నకిలీ పోర్టల్స్, వెబ్‌సైట్లతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. లాభాపేక్షతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తూ, ప్రజలను మోసం చేయడమే కాకుండా, పైరసీని ప్రోత్సహిస్తున్నారు. ఈ నకిలీ వెబ్‌సైట్ల దందాలో భాగంగా, తాజాగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఎస్‌బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌లోకి వెళ్తే.. అది సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అండ్ రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అయితే, ఊహించని విధంగా, ఈ పేజీలో పైరసీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి.

25
మూవీ రూల్జ్ సైట్‌కు రీడైరెక్ట్

మరోవైపు, గతంలో సినీ పరిశ్రమను తీవ్రంగా నష్టపరిచిన ఐబొమ్మ వంటి పైరసీ వెబ్‌సైట్ల పేరును సైతం ఈ నకిలీ పోర్టల్స్ వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్‌సైట్లకు ఐబొమ్మగా పేరు మార్చి, వాటిపై క్లిక్ చేస్తే తమ సొంత పైరసీ పేజీలకు రీడైరెక్ట్ అయ్యేలా సైబర్ నేరగాళ్లు సెట్ చేస్తున్నారు. ఇటీవల ఐబొమ్మ ప్లస్ అనే వెబ్‌సైట్‌పై క్లిక్ చేస్తే మూవీ రూల్జ్ అనే మరొక పైరసీ సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు.

35
ఐబొమ్మ క్లోజ్‌తో..

సినిమా పైరసీకి సంబంధించిన వెబ్‌సైట్లను గతంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మూసివేశారు. ఐబొమ్మతో పాటు బప్పం వంటి అనేక పైరసీ సైట్లను ఇమ్మడి రవి అనే వ్యక్తి ఆపరేట్ చేస్తుండగా, వాటిని క్లోజ్ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. అయితే, పోలీసులు ఒక సైట్‌ను మూసివేయగానే, వేల సంఖ్యలో కొత్త నకిలీ వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా వినియోగంలోకి వస్తున్నాయి.

45
ఎస్‌బీఐ పోర్టల్‌లో దర్శనం..

ఐబొమ్మకు సంబంధించి ఒక సైట్‌ను క్లోజ్ చేస్తే, ఐబొమ్మ వన్ పేరుతో మరో ప్రత్యేక సైట్‌ను ఏర్పాటు చేసి, దానిని క్లిక్ చేస్తే మూవీ రూల్జ్ వంటి ఇతర పైరసీ సైట్లకు దారి తీసేలా సెట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సినిమాలు చూసేందుకు సాధారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, కొంతమంది కేటుగాళ్లు ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ వంటి నమ్మకమైన పోర్టల్స్‌ను కూడా తమ పైరసీ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నారు.

55
అనేక కోణాల్లో దర్యాప్తు..

ప్రస్తుతం ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌కు సంబంధించి కూడా పైరసీ సైట్లు ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉండగా.. ఈ సైట్లను ఏ విధంగా నిర్వహిస్తున్నాడు, ఎవరు అతనికి సాంకేతిక సహాయం అందిస్తున్నారనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇంకెవరున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories