Senior NTR Ambassador Car is with Kalyan Ram : పెద్దాయన సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో అంబాసిడర్ కారు వాడేవారు. ఆ కారు నెంబర్ కూడా యమా క్రేజీగా ఉండేది. మరి ఆకారు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..? ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా..?
Senior NTR Ambassador Car is with Kalyan Ram: సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్మేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇలా తాను అడుగు పెట్టిన అన్ని రంగాలలో విజయపతాకం ఎగురవేసిన వ్యక్తి. అంతే కాదు రాముడు, కృష్ణుడు అటే అప్పటి జనాలకు ఎన్టీఆరే. ముఖ్యమంత్రిగా కూడా పేదవాడికి ఎన్నో మంచి పథకాలు అందించి దేవుడిగా కొలవబడ్డారు ఎన్టీఆర్. అప్పట్లో జనాలు తిరుపతి యాత్రకు వెళ్తే.. చెన్నై వెళ్ళి ఎన్టీఆర్ దర్శనం కూడా చేసుకుని వచ్చేవారట.
అంత క్రేజ్ అప్పట్లో ఎన్టీఆర్ అంటే. ఇక ఒక పార్టీ స్థాపించిన 9 నెలలో అధికారంలోకి వచ్చిన రికార్డ్ కూడా పెద్దాయనకే ఉంది. ఇక ఇలా ఉంటే ఎన్టీఆర్ ను యుగపురుషిడిగా చెప్పుకుంటారు ఫ్యాన్స్. ఆయన మరణించి 30 ఏళ్ళు అవుతుుంది.ఇప్పుడే కాదు.. ఎన్ని ఏళ్లు అయినా. ఎన్టీఆర్ క్రేజ్ అస్సలు తరగదు అనడంలో అతిశయం లేదు. అయితే ఎన్టీఆర్ గురించి ఎటువంటి వార్త వచ్చినా..అది వైరల్ అవుతుంది.
పెద్దాయన లైఫ్ స్టైల్ గురించి. ఆయన వాడిన వస్తువుల గురించి..ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయంలు.. ఆయనతో పాటు జర్నీ చేసినవారి నుంచి తెలుస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ వాడిన కారు గురించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.
సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా వాడిన కారు ఏదో తెలుసా..? పెద్దాయనకు ఇష్టమైన కారు అంబాసిడర్. ఆయన ఈకారులోనే ఎక్కువగా తిరిగేవారట. ప్రచారంలో కాని.. ఎక్కడికైనా వెళ్ళినా కాని ఇందులోనే తినేవారు. ఇందులోనే పడుకునేవారట.
ఈ అంబాసిడర్ కారుకు మంచి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉండేదట. ఇంతకీ ఆ నెంబర్ ఎంతో తెలుసా..? సీనియర్ ఎన్టీఆర్ వాడిన అంబాసిడర్ కారు నెంబర్ ABY 9999. అవును ఆయన సెంటిమెంట్ నెంబర్ 9 అంట. అందకే ఆయన కార్లకు 9 అంకె వచ్చేలా చూసుకుంటాడు.
ఇక పెద్దాయన మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. తారక్ తన కార్లకు 9 నెంబర్ పక్కాగా వచ్చేలా చూసుకుంటాడు. ఇక అదంతా పక్కన పెడితే.. పెద్దాయన కారు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..? ఎవరు ఈ కారును సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ వాడిన కారు అంటే ఎగబడి తీసుకుంటారు. కాని ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ కార్ గవర్నమెంట్ వద్ద ఉండిపోయింది.
66
Senior NTR Ambassador Car
కొన్ని రోజులకు గవర్నమెంట్ఈ కారును వేలం వేశారు. ప్రభుత్వం ఇలా చేయడం సహజమే. ఇక ఈ వేలంలో పెద్దాయన కారు ఎవరికీ వెళ్ళకుండా.. తన తాతకు ఇష్టమైన కారును తాను సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్.
ఆ వేలంపాటలో ఎన్టీఆర్ మనవడు, హీరో కళ్యాణ్ రామ్ ఆ కారుని కొనుక్కున్నాడు. తన తాతయ్య మీద ఉన్న ప్రేమతో కళ్యాణ్ రామ్ ABY9999 అంబాసిడర్ కారుని వేలంపాటలో పాడి .. తీసుకుని దాన్ని అందంగా తాయరు చేయించాడు.
అంతే కాదు ఆ కార్ ఇప్పటికి కళ్యాణ్ రామ్ ఆఫీసులోనే ఉంది, కళ్యాణ్ రామ్ ఆఫీస్ కి వెళ్ళగానే బయటే పెద్దాయన అంబాసిడర్ కార్ ABY9999 తో కనిపిస్తుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ వాడిన కారు అని తెలిసి.. చాలామంది అటువెళ్ళినప్పుడు ఆ కారుతో ఫోటోలు కూడా దిగుతుంటారు.