Published : Feb 01, 2025, 11:52 AM ISTUpdated : Feb 01, 2025, 11:55 AM IST
Naga chaitanya 20 crore Scene in Thandel Movie: నాగచైతన్య ఈసారి సాలిడ్ గా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. తండేల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈసినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తండేల్ మూవీలో 20 కోట్లు ఖర్చు పెట్టారట ఎందుకోసమో తెలుసా..?
Naga chaitanya 20 crore Scene in Thandel Movie: చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. లవ్ స్టోరీతో ఓ మోస్తరు హిట్ కొట్టిన చైతూ.. సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు. మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ.. భారీ సక్సెస్ లు మాత్రం అతన్ని వరించడంలేదు. దాంతో మరిన్ని ప్రయోగాలు చేస్తూ.. ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నాడు. తాజాగా తండేల్ మూవీతో రాబోతున్నాడు చైతు. ఈసినిమా చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సప్ట్ తో తెరకెక్కింది.
ఈమూవీకోసం నాగచైతన్య స్యయంగా రంగంలోకి దిగాడు. తండేల్ లో మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. దాని కోసం ఏడాది పాటు వారితో మమేకం అయ్యి.. వారి జీవన విధానం అలవాటు చేసుకున్నాడు చైతూ. రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. దాంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. చందు మెండేటి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది.
ఇక వీరిద్దరి కాంబో అంటే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాదు తండేట్ మూవీలో ఎన్నో విషేశాలు ఉన్నాయి. ఈసినిమా గురించి చెప్పాలంటే టైమ్ సరిపోదేమో అంత డిఫరెంట్ గా సినిమా ఉండబోతోంది. అంతే కాదు రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈసినిమా కోసం అల్లు అరవింద్ 80 కోట్ల బడ్జెట్ పెట్టాడట. నాగచైతన్యను నమ్మి అంత బడ్జెట్ పెట్టాడంటే అది పెద్ద విషయమనే చెప్పాలి.
అంతే కాదు ఈసినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ చందూమెండేటి చాలా విషయాలు పంచుకున్నారు. ఈమూవీలో డి.మత్స్యలేశ్యం గ్రామానికి సబంధి సినిమా అంతా ఉంటుందట. ఆ ఊరిలో మత్య్సకారుల జీవితం. అక్కడ వారు ఎదురుకొన్న తుఫానులు, కష్టాలు విని మనసు కరిగిపోయిందట దర్శకుడిది. వారు చెప్పినదానికి దృశ్య రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేశాను.
తుఫాన్ లకు సబంధించిన సీక్వెన్స్ లు తీయ్యడానికి 18 నుంచి 20 కోట్ల వరకూ అయ్యింది. కాని నిర్మాతగా అల్లు అరవింద్ గారు ఒక్క మాట కూడా అడగకుండా ఎంత కావాలంటే అంత బడ్జెట్ ను ఇచ్చేశారు అని అన్నాడు చందు మెండేటి. ఇక ఈమూవీలో నాగచైతన్య, సాయి పల్లవి కెమెస్ట్రీ అద్బుతంగా వర్కౌట్ అవుతుందనడంలో డౌట్ లేదు. ఇక ఈసినిమా పిబ్రవరి 7వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.